news

ఈ ఉద్యోగాలంటే మగాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువ ఇష్టం ..ఏంటో తెలుసా …!

సర్వేలో బయటపడ్డ ఆసక్తికర నిజాలు

అందానికి ప్రతిరూపం అమ్మాయిలు. అమ్మాయిలను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నీట్ గా రెడీ కావడం దగ్గరి నుంచి అన్ని రకాలుగా ఇప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, తాజా అధ్యయనం ప్రకారం మగవారు చేసే జాబ్ ను బట్టి కూడా అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడతారని తెలుస్తోంది. ఒక్కో అమ్మాయికి ఒక్కో ప్రొఫెషనల్ వర్క్ చేసేవారంటే ఇష్టపడతారని మరో అధ్యయన కనిపెట్టంది. మరి ఆ రంగాలు ఏమిటి.. వాళ్లు అందులో పని చేసే వారిని ఇష్టపడడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం.

రచయిత:

ఒక రచయిత ఎవరినైనా ప్రేమిస్తే అతను తన జీవితాంతం ఆమెతోనే కలిసి ఉంటాడని కొందరు అమ్మాయిల అభిప్రాయం. బాధలో ఉన్న సందర్భంలో మనం చెప్పలేని ఎన్నో విషయాలను వారు స్వయంగా అర్థం చేసుకుని ఓదార్పు ఇస్తారని వీరు భావిస్తారట. అందుకే అమ్మాయిలు రచయితలను ఎక్కువగా ఇష్టపడతారని అంటారు.

ఫొటోగ్రాఫర్:

ఫోటో అంటే అందరికీ ఇష్టమే. ఎప్పటికప్పుడు తమ అందాలను ఫోటో రూపంలో క్యాప్చర్ చేసుకోవడానికి అమ్మాయిలు ఆసక్తి చూపుతారు. తమను డిఫరెంట్ స్టైల్స్ లో ఫొటోలు తీసే మగవారంటే కొందరు పడిచస్తారట.

చెఫ్:

ప్రతి మహిళకు కూడా బాగా వండిపెట్టే మగవారంటే భలే ఇష్టమంట. అందుకే కొందరు అమ్మాయిలు చెఫ్ ప్రొఫెషనల్ లో ఉన్న జెంట్స్ ను ఇష్టపడుతుంటారట. వంటచేసే మగవారు దొరికితే ఏ అమ్మయైన ఎందుకు వదులుకుంటుంది చెప్పండి.

మిలటరీ మ్యాన్:

ఆర్మీలో పని చేసే వారు ఫిట్ గా ఉండమే కాకుండా చాలా అందంగా ఉంటారని అమ్మాయిుల భావిస్తారట. అలాగే మిలటరీలో పని చేసేవాళ్లు నిజాయితీగా ఉంటారని మహిళల నమ్మకం. నిజాయితీ సిన్సియారిటీ ఉంటుంది కాబట్టి ఈ రంగంలో ఉన్న వాళ్ళను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.

ఫైలట్:

ఫైలట్ జాబ్ అంటే రెస్పాన్సిబిలిటి ఎక్కువ. జాబ్ లోనే రెస్పాన్సిబిలిటీ మరి పెళ్లి చేసుకున్నాక భార్య విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటారో తెలిసిందే. అందుకే ఈ రంగంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపుతారట. అంతేకాదు, వారి డ్రెస్ సెన్స్ కూడా అద్బుతంగా ఉంటుంది. అందుకే ఈ రంగంలో ఉన్న వారిని ఎక్కువ లైక్ చేస్తారు.

డాక్టర్:

మెడికల్ ప్రొఫెషన్ అనేది మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. చాలెంజింగ్ ప్రొఫెషన్ కూడా. అంతేకాదు, ఈ రంగంలో ఉండే వ్యక్తులకు సంఘంలో గౌరవం కూడా ఎక్కువ. అందుకే ఈ రంగంలో ఉన్న వారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.

ఎంటర్ ప్రెన్యూర్:

ప్రస్తుత కాలంలో ఈ ప్రొఫెషన్ కూడా మంచి ఆదరణ ఉంది.
ఈ రంగంలో డబ్బు సంపాదన హోదా కూడా ఉంటుంది. అందువల్ల చాలామంది ఆడవారు ఈ ప్రొఫెషనల్ లో వర్క్ చేసేవారికి ఎక్కువ ప్రియార్టీ ఇస్తుంటారట.

బార్ అటెండర్:

అమ్మాయిలకు ఈ ప్రొఫెషన్ లో ఉండే వాళ్లు కూడా నచ్చుతారా అని ఆశ్చర్యపోతున్నారా.. అందరికీ ఈ ప్రొఫెషన్లో ఉన్న వారంటే నచ్చదు. కొందరికి మాత్రం ఈ ప్రొఫెషన్ అంటే ఇష్టపడతారు. అలాంటి మహిళలు వీరిని లైక్ చేస్తారట.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్:

ఐటీ రంగం అంటే ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. మంచి జీతం. మంచి హోదా. అంతకు మించి వారంలో రెండు రోజులు సెలవులు. ఫారెన్ వెళ్ళే అవకాశం. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటే కంటే హ్యాకర్స్ అంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారని తాజా సర్వేలో తేలింది.

మ్యుజిషియన్:

రాక్ స్టార్ట్స్ అంటే ప్రతి అమ్మాయికి భలే ఇష్టం. అలాంటి వారితో డేటింగ్ చేయడాన్ని ఆడవారు బాగా ఇష్టపడతారట. సంగీతంతో మనసు మార్చగలిగే శక్తి వీరికి ఉంటుంది.
యాక్టర్: సినిమా రంగం అంటే ప్రతి ఒక్కరికీ చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. ఇక యాక్టర్స్ కోసం లైఫ్ ను డెడికేట్ చేయాలనుకునే మహిళలు కూడా ఎక్కువే. గ్లామర్ రంగం కాబట్టి తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

Comments

comments