news

25 ఏళ్లు పూర్తి చేసుకున్న SMS

మొబైల్ వినియోగించే ప్రతి ఒక్కరికి SMS అంటే ఏంటో తెలుసు..ఉదయం లేచి గుడ్ మార్నింగ్ దగ్గరి నుండి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పే వరకు ఈ SMS ను వాడుతారు. అలాంటి ఈ SMS వచ్చి సరిగ్గా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది

1992 డిసెంబర్‌ 2న తొలి ఎస్సెమ్మెస్‌ వెళ్లింది. 22 ఏళ్ల ఓ యువ ఇంజినీర్‌ ఈ మెసేజ్ పంపారు. అదీ కంప్యూటర్‌ నుంచి వొడాఫోన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ మెసేజ్ సెండ్ అయ్యింది. ‘మేరీ క్రిస్మస్‌’ అనేది ఫస్ట్ మెసేజ్. ఆ తర్వాత SMS వాడుకలోకి వచ్చింది.

1993లో నోకియా సంస్థ తొలిసారిగా SMS పంపుకొనే సౌకర్యం కలిగిన హ్యాండ్‌సెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటికి SMS అందుబాటులో ఉంటూ ఎంతమందికి ఉపయోగపడుతుంది.

Comments

comments