news

బ్యాంక్ నుండి 94 కోట్లు లూటీ…

మహారాష్ట్రలోని పూణె నగరంలో కాస్మోస్‌ బ్యాంకు ప్రధాన బ్రాంచిలోని సర్వర్లను హ్యాక్‌ చేసి సైబర్‌ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. పెద్ద మొత్తంలో డబ్బు దోపిడీ చేశారు. భారత్‌, హాంగ్‌కాంగ్‌లలో దాదాపు రూ.94.42కోట్ల ట్రాన్సక్షన్లు హ్యాక్‌ చేసి లూటీ చేశారని బ్యాంకు అధికారులు పూణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సర్వర్‌ ఆగస్టు 11న హ్యాక్‌ అయి, వివిధ ట్రాన్సక్షన్ల రూపంలో దాదాపు రూ.78కోట్ల డబ్బును దేశం బయటకు తరలించబడిందని తెలిపారు. రూ.2.5కోట్ల లావాదేవీలు భారత్‌లో జరగగా… నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ), వీసాల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు.

ఆగస్టు 13న సర్వర్ మరోకసారి హ్యాక్‌ అయ్యిందనీ. స్విఫ్ట్‌ లావాదేవీల ద్వారా రూ.14కోట్లను హాంగ్‌కాంగ్‌లోని హాంగ్‌సెంగ్‌ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ జరిగిందని తెలిపారు. ఏఎల్‌ఎం ట్రేడింగ్‌ లిమిటెడ్‌ పేరు మీద ఉన్న అకౌంటుకు ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించామని వెల్లడించారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఏఎల్‌ఎం ట్రేడింగ్‌ లిమిటెడ్‌, ఇతర గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో కలిసి పూణె సైబర్‌ క్రైం సెల్‌ పోలీసులు విచారణ మొదలుపెట్టింది.

Comments

comments

Tags