movies

అఖిల్ మూడవ సినిమాకి టైటిల్ అదేనా..?

అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్, హలో’ సినిమాల తరువాత ప్రస్తుతం మూడవ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుంది. తొలి ప్రేమ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి కొద్దీ రోజుల్లో లండన్లో షూటింగ్ ను ముగించుకొని ఇండియాకి తిరిగిరానుంది సినిమా యూనిట్.

అఖిల్ మూడవ సినిమాకు ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ ను పెట్టనున్నారనే వార్తలు గతం లోనే బాగా వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా కోసం అదే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించారట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర చాలా చిత్ర పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతుంది.

Comments

comments