news

కోర్ట్ మెట్లు ఎక్కిన అక్కినేని ఫ్యామిలీ..

అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియనివారుండరు..ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున , అఖిల్ , నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న , మిగతా సభ్యులంతా అన్నపూర్ణ స్టూడియోస్, మొదలగు వాటిని చూసుకుంటున్నారు. తాజాగా అక్కినేని సుమంత్ , సుప్రియ లు కోర్ట్ లో కనిపించేసరికి అందరికి ఆశ్చర్యం కలిగించింది.

ఎందుకా అని ఆరా తీయగా అసలు నిజం బయట పడింది. సుమంత్ హీరోగా నరుడా డోనరుడా అనే సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. హిందీ లో హిట్ అయినా విక్కీ డోనర్ ను తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాకు జాన్ సుధీర్ పూదోటతో పాటు.. యార్లగడ్డ సుప్రియ కూడా ఓ నిర్మాత గా వ్యవహరించారు. అయితే ఈ మూవీ ప్లాప్ కావడం తో వీరికి భారీ నష్టాలే మిగిలాయి. ఈ సినిమా సమయంలో ఓ ఫైనాన్షియర్ కు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో.. కేసు వేసాడు. ఆ కేసుకు సంబంధించిన విచారణకు సుమంత్ తో పాటు సుప్రియాలు ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు కు హాజరయ్యారు.

 

Comments

comments