news

పవన్ మాటలకు సమాధానం చెప్పిన బన్నీ

అల్లుఅర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వార్ ఇప్పటిది కాదు . నేను చెప్పను బ్రదర్ అని బన్నీ చెప్పిన డైలాగ్ నుండి మొదలైన వివాదం , మొన్న ‘దువ్వాడ జగన్నాథం’ రిజల్ట్ పై పనిచేసింది అన్న వాస్తవాలు ఓపెన్ సీక్రెట్ గా మారాయి. ఇక ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్ అయినా పవన్ , ప్రజారాజ్యం పెట్టినప్పుడు తన అన్న చిరంజీవిని మోసం చేసిన ద్రోహులుగా అల్లు అరవింద్ , పరకాల ప్రబాకర్ల పేర్లను ప్రస్తావించడం పెను దుమారాన్ని రేపగా , ఇప్పుడు తన నాన్నపై చేసిన విమర్శలకి బన్నీ రియాక్ట్ అయ్యాడు .

ప్రజారాజ్యంలో టికెట్లు అమ్ముకోవడం , కాంగ్రెస్ లో విలీనం చేయించిన ద్రోహం అరవింద్ దే , అప్పుడు నేను ఏమి చేయాలనీ నిస్సహుయుడిగా ఉండిపోయాను , నేనంటే అన్నయ్యకు ప్రేమ వున్నా అల్లు అరవింద్ ని అన్నయ్య కాదనలేడని, నన్నుకొన్ని సార్లు ప్రచారానికి పోనివ్వకుండా అరవింద్ నన్ను అవమానించేవాడని , నేను పార్టీ నాశనం అవుతుందని ఎంత చెప్పిన అరవింద్ నా స్పందనను అన్నయ్య దెగ్గరకు చేరనిచ్చేవాడు కాదని అన్న మాటలు బన్నీ వరకు వెళ్తే , తన సన్నిహితులతో తెగ వర్రీ అయిపోయారంట బన్నీ .

మా నాన్న , చిరంజీవి గారిలా బంధం ఈనాటిది కాదు . చిరంజీవిగారు మెగా స్టార్ అవ్వనప్పడి నుండి సినిమాల ఎంపికలో , పెర్సినల్ , ప్రొఫెషినల్ ఇలా ఏ విషయంలో అయినా , వీరిద్దరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకునేవారు . కొన్ని సార్లు సక్సెస్ అయ్యేవారు , ఇంకొన్ని సార్లు అంచనాలు తలకిందులు అయ్యేవి . చిరంజీవిగారిది , మా నాన్నది 30సంవత్సరాల బంధం.., ఏవో కొన్ని విషయాల్లో అనుకోకుండా జరిగిన పొరపాట్లకు మా నాన్నని నిందించడం పవన్ కి తగదని , అయినా పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు , ప్రజారాజ్యం 18సీట్లు వచ్చి కష్టకాలంలో వున్నప్పుడు , ఇప్పుడు మాట్లాడుతున్న వారెవరు చిరంజీవి గారి పక్కన లేరు , మా నాన్నగారే నిలబడ్డారు .., విజయాల్లోనే కాదు , కష్టాల్లో కూడా.., అన్ని వేళల , చిరంజీవిగారి పక్కన మా కుటుంబం నిలబడ్డది , చిరంజీవి గారిపై మా అభిమానం అలాంటిది అని అల్లు అర్జున్ అనడం జరిగింది .

Comments

comments