news

భరితెగించిన అమెజాన్, ఏం చేసారో ……??

ఆన్ లైన్ మార్కెట్ లో పెద్ద స్థానాన్ని ఆక్రమించుకున్న అమెజాన్ సంస్థ చిక్కుల్లో పడింది.ఈ సంస్థ పై హిందువులు ఆగ్రహిస్తూ ,విమర్శలు చేస్తున్నారు. హిందులకు సంబదించిన దేవుళ్ళ చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రించి ఉన్న వాటిని అమెజాన్ సేల్స్ లో పెట్టిన విషయం పై పెద్ద ఇష్యూ అయ్యి ధుమారం రేపుతుంది .డోర్ మ్యాట్ ల పై హిందూ దేవుళ్ళు అయిన శివుడు, విష్ణువు, కృష్ణుడు, వినాయకుడు, లక్ష్మీదేవి, హిందువులు పవిత్రంగా పూజించే దేవుళ్ల చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రించి తమ విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని, కించపరుస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు..

ఇందు వలన అమెజాన్ ను భారత్ లో బాయ్ కాట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ సంఘం అధికార ప్రతినిధి రాజన్ నెవడాలో మీడియాతో మాట్లాడుతూ… అమెజాన్ ప్రెసిడెంట్ పి.బెజోస్ ఈ విషయంపై హిందువులకు క్షమాపణ చెప్పాలని, దేవుళ్ల చిత్ర పటాలున్న మ్యాట్ లను ఆన్ లైన్ నుంచి వెంటనే తీసెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే అమెజాన్ ధోరణి గురించి పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు.వ్యాపారం అన్న తరవాత అందరిని ఆకట్టుకునేలా ఉండాలి అనే లాజిక్ ని అమెజాన్ బాగానే ఫాలో అవుతుంది కాని ,ఆకట్టుకోవడం ఎంత అవసరమో అందరికి అనునయంగా ఉంటూ ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే అవసరం.అంతే కాని ఇలా కొన్ని మతాలనో ,వర్గాలనో కించపరుస్తూ ఉండం వలన వాళ్ళ ఆగ్రహానికి గురి కాక తప్పదు . ఇప్పటికైనా పలు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడమే కాకుండా ,వ్యాపార రీత్యా ఇంతకాలం సంపాదించుకున్నా బ్రాండ్ నేమ్ కూడా దెబ్బతింటుందని ,ఎవరు అమెజాన్ మొఖం కూడా చూడటానికి ఇష్టపడరని అనుకుంటున్నారు.

Comments

comments