పూర్వం మన ప్రాచీనులు కొన్ని సమస్యల పరిష్కారానికి అలోచించి కొన్ని విధానాలు పెడతారు దాని వెనక ఆధ్యాత్మిక కారణాలు తో పాటు వైద్యా కారణాలు ఉంటాయి. కానీ ఈ తరం వారు ఆ ఆచారాల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ ఆచారాల వెనుక ఉన్న కారణాలు తెలిస్తే మన పూర్వికులు ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారో తెలుస్తుంది.
ఆషాడ మాసం లో అత్తగారు కోడలు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు అంటే?
పూర్వం మనం అందరం ఉమ్మడి కుటుంబాలు గా ఉండేవాళ్ళం. తల్లి తండ్రి తో కుమారుడు కలిసి ఉండేవాడు కాబట్టి కోడలు ఆ ఇంట్లో వుంటే అత్తగారు కోడలు వుంటారు. అందుకే భార్య భర్త ఇద్దరు దూరంగా ఉంటె మంచిది అనే అభిప్రాయం.
భార్య, భర్త ఆషాడం లో కలిసుంటే ఏం అవుతుంది దూరంగా ఉంటె ఏం అవుతుంది.
♦మొదటి అభిప్రాయం.
ఆషాడం లో దాంపత్యుల మధ్య సమాగమనం జరిగి స్త్రీ కి గర్భవతి అయ్యి 9 నెలలు తర్వాత అంటే వేసవిలో పిల్లలు జన్మిస్తారు. అది ప్రసవానికి ఇబ్బందికరం గా ఉంటుంది. వేసవి లో పిల్లలు జన్మిస్తే ఎదుగుదల కి ఆటంకం కావచ్చు అని అభిప్రాయం.
♦రెండో అభిప్రాయం.
పూర్వం మన దేశం లో వ్యవసాయం ఒకటే జీవనోపాధి. ఆషాడ మాసం లో వర్షాలు పడి పంటలు బాగా పండే సమయం కాబట్టి మొగవారు పొలం పనులు చూసుకోవాలి. కొత్తగా పెళ్లి అయినా భార్య పై మోజు తో పొలం పనులు మానేసి ఇంట్లో కూర్చుంటారు అని ఈ ఆచారాన్ని పాటిస్తారు.
కొత్తగా పెళ్లైన భార్య భర్త ల మధ్య విపరీతమైన ప్రేమ ఉండడం సహజమే. ఈ మాసం లో దూరం గ ఉంటె దూరం అయినా భాద వారికీ తెలుస్తుంది. యెంత దూరం గా ఉంటె అంట ప్రేమ పెరుగుతుంది. ఈ దూరం వారి కష్ట సుఖాలు పంచుకుని అన్యోన్యంగా వుంటారు అనే ఈ ఆచారాన్ని పెట్టారు మన పూర్వికులు.
Add Comment