movies reviews

‘భరత్ అనే నేను’.. సినిమా ఎలా ఉందో తెలుసా? ‘రంగస్థలం’ కంటే ఎక్కువ రేటింగ్!

బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి భారీ ఫ్లాపుల తర్వాత మహేష్ బాబు ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ‘భరత్ అనే నేను’ మూవీ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి ఎన్నో ఆశల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ(U/A) సర్టిఫికెట్ జారీ చేసింది.. ఈ సినిమా చూసిన వారు షాక్ అయినట్టు తెలిసింది. వారు తమ సన్నిహితులతో ఈ సినిమా టాక్ చెప్పేశారట.. ఇప్పుడీ ఆ సినిమా ఎలా ఉందనే వార్త సంచలనమైంది. ఇంతకూ బయట ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే..

మహేష్ బాబు ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా భారీ అంచనాలతో సుమారు 2000 థియేటర్స్‌లో భారీ విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ‘బ్లాక్ బస్టర్ హిట్.. మహేష్ బాబు యాక్షన్ అదిపోయింది’ అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సాంధూ. అంతేకాదు ఈ చిత్రానికి ఏకంగా నాలుగు స్టార్లు ఇచ్చేశాడు.

అనుకోని పరిస్థితుల్లో ఏపీ సీఎంగా ఉన్న మహేష్ బాబు తండ్రి ఆకస్మికంగా మరణిస్తాడు.. దీంతో విదేశాల్లో చదువుకుంటున్న మహేష్ బాబు ను తల్లి ఆంధ్రప్రదేశ్ కు రప్పిస్తుంది.. ఆ తర్వాత తండ్రి స్థానంలో సీఎంగా చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. కానీ రాజకీయాలంటే తెలియని మహేష్ బాబు ఫస్ట్ ఆఫ్ లో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొంటాడు. రాజకీయ కుట్రలకు బలైపోతాడు.. దీంతో తల్లి దగ్గరకు తీసుకొని హితబోద చేస్తుంది.

రాజకీయాల్లో నీలాగా సాఫ్ట్ గా ఉంటే నడవదు.. జనం కోసం ఈ కుల్లు రాజకీయాలను నీతిగా నిజాయితీ చాకచక్యంగా ఎదుర్కోవాలంటూ కొడుక్కి రాజకీయ ఎత్తుగడలు నేర్పిస్తుంది. దీంతో తల్లి కోరిక మేరకు సెకండాఫ్ నుంచి తన రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయడం, దానికి సమాంతరంగా ప్రజాసేవ చేస్తూ ప్రజల మనన్నలు మహేష్ బాబు పొందుతాడు.. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రతిపక్షాలు భారీ కుట్రకు పాల్పడడం.. దాన్ని మహేష్ చేధించడాన్ని క్లైమాక్స్ అత్యద్భుత రాజకీయ డ్రామాల మధ్య తెరకెక్కించినట్టు సెన్సార్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ గా వ్యాఖ్యానించారు.

ఈ సినిమా చూశాక బయటకు వచ్చిన టాక్ ప్రకారం.. కథ పరంగా ఇది ఏపీ, తెలంగాణ రాజకీయాలను కుదేపిస్తుంది. ఒక సీఎం ఎలా ఉండాలో.. ఎలా సేవ చేయాలో అనేది కొరటాల ఈ సినిమాలో చూపించాడు. మహేష్ బాబు లాంటి అద్భుత నటుడిని ఈ సినిమాలో 100కు 100శాతం వాడుకొని కొరటాల రాజకీయాలను షేక్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. ఇండస్ట్రీ రికార్డులను ఈ సినిమా ఖచ్చితంగా కొల్లగొడుతుందని.. రంగస్థలంను మించి నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని సినిమా చూశాక చిత్రం యూనిట్ ను ప్రశంసించినట్టు సమాచారం.

భరత్ అనే నేను చిత్రానికి రేటింగ్

దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే ఉమేర్ సాంధూ ఈ మధ్యకాలంలో సినిమా విడుదలకు ముందే రివ్యూలను పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రానికి ఈయన 3.5/5 రేటింగ్ ఇవ్వగా.. ‘భరత్ అనే నేను’ చిత్రానికి ఏకంగా 4/5 రేటింగ్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ లెక్కన ‘రంగస్థలం’ మూవీని మించి ‘భరత్ అనే నేను’ ఉందనేది ఆయన తాజా రివ్యూ సారాంశం

Comments

comments