news

బిగ్ బాస్ 2 లో వచ్చేది వీళ్ళేనా ?!!

తెలుగు టీవీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి ఇచ్చిన బిగ్ బాస్ షో మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా టేకప్ చేసాక సినిమాల కోసం రెండో సిరీస్ కంటిన్యూ చేయలేను అని చెప్పేసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత ఆ పగ్గాలు ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని చేతిలో పడ్డాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోబోతున్న బిగ్ బాస్ 2 కోసం అతి కీలకమైన పార్టిసిపెంట్స్ వేట సాగుతోంది. ప్రస్తుతం ఓ ఐదారుగురు దాకా ఫైనల్ అయ్యారని తెలిసింది. వాళ్ళెవరో చూద్దాం.

స్టూడెంట్  నెంబర్ వన్ లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరొయిన్ గా పరిచయమై కొన్నాళ్ళు బాగానే రాజ్యమేలిన గజాలాను తీసుకున్నారని తెలిసింది. ఆ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన గజాలా ఇది తనకు కం బ్యాక్ లాగా ఉపయోగపడుతుందని ఓకే చేసినట్టు చెబుతున్నారు. ఇక సింగర్ గా టాలీవుడ్ లో మంచి పేరున్న గీతా మాధురి ఇందులో పాల్గొనేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి నువ్వే కావాలి సినిమాతో అమాంతం తన రేంజ్ పెంచుకున్న హీరో తరుణ్ తక్కువ టైంలోనే సినిమాలు మానుకోవాల్సి వచ్చింది. ఇటీవలే ఇది నా లవ్ స్టొరీతో మళ్ళి వచ్చే ప్రయత్నం చేసాడు కాని అది వారం రోజుల కన్నా ఎక్కడా ఆడకపోవడంతో ఇక ఛాన్స్ రాదని గుర్తించి బిగ్ బాస్ 2 ద్వారా టీవీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. శ్యామల అనే ట్రాన్స్ జెండర్ ని కూడా తీసుకున్నట్టు టాక్.

హీరొయిన్స్ పక్కన సపోర్టింగ్ రోల్స్ తో పాటు సోలోగా వెబ్ సీరిస్ లు చేస్తున్న తేజస్వి మడివాడ కూడా ఎంపికైనట్టు సమాచారం. తనను ఫస్ట్ సీజన్ కే తీసుకోవాలి అనే ప్రయత్నాలు జరిగినప్పటికీ కాల్ షీట్స్ సమస్య వల్ల కుదరలేదు. సీనియర్ నటి రాశితో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఫస్ట్ సీజన్ లో పాల్గొన్న వారు అంతగా బజ్ తేలేకపోవడంతో ఈసారి చాలా జాగ్రత్తగా వడబోత కార్యక్రమం చేస్తున్నారు. ఈ సారి షూటింగ్ ముంబై లో కాకుండా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగనుంది.

Comments

comments