news

బిగ్ బాస్ 2 కాసుల లెక్కలు ?

మొన్నటి నుంచి ప్రారంభమైన బిగ్ బాస్ 2 షో నాని ఓపెనింగ్ తో పర్వాలేదు అనిపించుకుంది కానీ నిన్నటి నుంచి మాత్రం హుషారు తగ్గింది. ముఖ్యంగా సెలెబ్రిటీలు మరీ పేరున్న వాళ్ళు కాకపోవడంతో కొంత డల్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతోంది. స్టార్ మా ఈ సారి వినూత్నంగా హాట్ స్టార్ ద్వారా పగటి పూట సైతం బిగ్ బాస్ షోని యాప్ ద్వారా లైవ్ లో చూసే వెసులుబాటు కలిగించడం కొత్త ట్రెండ్. కానీ దానికి అంత రెస్పాన్స్ అయితే కనిపించడం లేదు.

ఇంకా మసాలా తోడవ్వడానికి టైం పడుతుంది కనక అప్పటి దాకా బోర్ ని భరించక తప్పదు. ఇక ఇందులో పాల్గొంటున్న వాళ్లకు ఎంతిస్తున్నారు అనేదాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సింగర్ గీతా మాధురికి హౌస్ లో  ఎన్ని రోజులు ఉంటుంది అనే దానితో సంబంధం లేకుండా 20 లక్షల దాకా ముట్టజెబుతున్నారు అనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. పాటలు పాడే అవకాశాలు త్యాగం చేసినందుకు కాస్త అంత ఎక్కువ మొత్తానికి నిర్వాహకులు ఒప్పుకున్నట్టు తెలిసింది.

యాంకర్ శ్యామలకు 5 నుంచి 10 లక్షల మధ్య, తనీష్ కు అంతే మొత్తంలో  కాస్త లక్ష రెండు లక్షలకు అటు ఇటుగా ఇస్తున్నట్టు తెలిసింది. ఇంకా కామన్ మ్యాన్ క్యాటగిరీలో వచ్చిన వాళ్లకు మాత్రం ప్రయాణపు ఖర్చులతో పాటు రోజు వారి మొత్తానికి మాట్లాడుకున్నట్టు వినికిడి . అది 15 వేల నుంచి 25 వేల మధ్యలో ఉండేలా ప్లాన్ చేశారట. టీవీలో అంత పెద్ద షోలో కనిపించడమే గొప్ప విషయం కనక వారు కూడా మారుమాట్లడలేదని టాక్.

ఇక అందరికి ఇంచుమించు మీడియం రేంజ్ లో చెల్లించేలా ఒప్పందం రాసుకున్నట్టు తెలిసింది. బాబు గోగినేనిది  మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. అది కూడా లీక్ అవ్వకపోదు. ఎలిమినేషన్ ఈ వారం నుంచే మొదలుపెట్టబోతున్నారు.  ఎవరు ముందు బయట పడతారా అనే ఆసక్తి అప్పుడే మొదలైంది.

Comments

comments