health

బరువును తగ్గించే ప్రయత్నంలో ఉన్నారా, ముందు మీ ఆకృతి గురించి మీరు తెలుసుకోండి

బరువును తగ్గించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు, తమ శరీర కొలతలు తీసుకోవడం ద్వారా, బరువు కోల్పోవునప్పుడు మారుతున్న శరీర ఆకృతిపైన సరైన అంచనా కలిగి ఉండడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. బరువు తగ్గే ప్రయత్నంలో, శరీరం అసాధారణ మార్పులకు లోనవడo సర్వసాధారణం. మీ గుండె మరింత సమర్థవంతంగా పనిచేయడం, మీ రక్తప్రసరణ మెరుగుపడడం మరియు శరీరం యొక్క కణాలు దృడంగా తయారవడం మొదలైన ఆరోగ్యకర మార్పులకు మీ శరీరం లోనవుతుంది. విజయవంతముగా బరువు తగ్గడానికి ఈ మార్పులు అవసరమే. అయితే, కొన్నిసార్లు బరువు తగ్గడంలో కలిగిన అసాధారణ మార్పుల కారణంగా నిరాశ చెందడం జరుగుతుంటుంది. కావున, బరువును తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఎలా అంచనా వేసుకోవాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. అదెలాగో ఇక్కడ చూడండి.

మీ శరీర బరువును నిర్ణయించేవి ఏవి? ఎత్తు మరియు వయస్సు మాత్రమే కాకుండా మీ శరీర బరువును ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వయస్సు, లింగం, శరీర చట్రం(ఫ్రేమింగ్), ఎముక సాంద్రత, శరీర కొవ్వు శాతo మరియు ఎత్తు వంటివి వ్యక్తి బరువును లెక్కించే కారకాలుగా భావించబడతాయి. మీ జీవక్రియరేటు, జన్యువులు మరియు జాతి కూడా మీ ఆదర్శ శరీర బరువును నిర్ణయించడoలో కీలకపాత్ర పోషిస్తాయి.

బరువు తగ్గడానికి స్కేల్ లేకుండా శరీర కొలతలు తీసుకోవచ్చా : నిజానికి బరువు తగ్గడానికి తీసుకునే శరీర కొలతలకై ఉత్తమ మార్గం పాత కాలపు టైలరింగ్ టేపులు. ఈ టేపుల వాడకం, పరిమాణం తగ్గినప్పుడు మరియు మీ శరీరo బరువు కోల్పోయినప్పుడు శరీరాకృతిని ఖచ్చితత్వంతో కొలతలు తీయగలదు.

ముఖ్యంగా సాధారణ శరీర భాగాలైన మీ చేతులు, ఉదరం, నడుము, తొడలు మరియు కటి ప్రాంతం కొలతలు తీయవలసి ఉంటుంది. మీ చర్మంపై కొలిచే కొలతకు, దుస్తులపై నుండి తీసుకునే కొలతల మద్య ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. కావున మీరు తీసుకునే కొలతల విధానం మీదనే ఖచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. నెలకి ఒకసారైనా కొలతలు తీసుకోవడం మంచిది.

ఎందుకంటే రోజులో లేదా కొన్ని వారాలలో కొలతల్లో మార్పులు స్పష్టంగా కనిపించవు. మీరు ఇద్దరు పిల్లలున్న 31సంవత్సరాల వయసుకలిగిన మహిళ అయితే, మీ జన్యువులలో ఊబకాయం మరియు విస్తృతమైన శరీరచట్రం కూడి, 76కిలోల బరువుతో 5అడుగుల 6అంగుళాల ఎత్తు ఉన్నారు అనుకుంటే., ఇలాంటి ఖచ్చితత్వoతో కూడిన లెక్కలే బరువు తగ్గడంలో ప్రధానంగా అవసరమవుతుంది.

దుస్తులతో కలిపి మీ శరీరబరువు నియంత్రణను అంచనా వేయగలరా? మీరు ధరించే దుస్తుల ఆధారితంగా మీ బరువు నష్టాన్ని కూడా అంచనా వేయవచ్చు. కొన్ని జీన్స్ జతలను కొన్ని వారాలపాటు ధరించడం ద్వారా మీ పురోగతిని అంచనా వేయవచ్చు. ఒకవేళ బరువును తక్కువగా కోల్పోతే, జీన్స్ టైట్నెస్ లో తేడాను గమనించవచ్చు. అలా కాకుండా ఇంకా బిగుతుగా ఉంటే, మీరు బరువును కోల్పోలేదని అర్ధం. మామూలుగా ఎక్కువశాతం జీన్స్ సాగే తత్వాన్ని కలిగి ఉండవు. తద్వారా మీకు ఒక అంచనా ఏర్పడగలదు
మీ బాడీ కొవ్వును పరీక్షించండి. మీ శరీరoలోని కొవ్వు శాతాన్ని మీ కొవ్వు కణజాలానికి మరియు లీన్ మాస్ కు మద్య ఉన్న వ్యత్యాసంగా పరిగణిస్తారు. ప్రధానంగా ఎముక, కండర మరియు బంధన కణజాలం యొక్క కొలత ఆధారితంగా క్రొవ్వు శాతాన్ని అంచనా వేస్తారు. మీ బరువు సాధారణoగా ఉండి, అధిక కొవ్వు శాతాన్ని శరీరంలో కలిగి ఉంటే, మీరు టైప్2-మధుమేహం మరియు గుండెజబ్బులతో సహా ఊబకాయంతో సంబంధం ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. శరీరoలోని అధిక కొవ్వు, పురుషులకి 23.1శాతం కంటే ఎక్కువగా ఉండగా, మహిళలకు 33.3శాతంకన్నా ఎక్కువగా పరిగణించబడింది. ఇది అత్యంత ప్రమాదకరం. మీ శరీర కొవ్వు తగ్గే కొలదీ, మీరు మీ బరువును కోల్పోయారన్న అనుభూతికి లోనవడం జరుగుతుంది.

మీరు మీశరీరాన్ని కొలిచే సమయంలో క్రింది అంశాలను గుర్తుంచుకోండి:

•బూట్లు లేదా చెప్పులు లేకుండా ఎత్తును కొలవండి.

•మెడ స్వరపేటికకు కిందుగా, కొద్దిగా ముందుకు వంచినట్లుగా చూసుకోవాలి.

•పురుషుల నడుమును నాభి వద్ద కొలుస్తారు మరియు మహిళలలో నాభి పైన కొలుస్తారు. అది మర్చిపోకూడదు. బరువుకు సంబంధించిన స్కేల్ ఉపయోగించుటలో సరైన మార్గం ఏమిటి?
1. ఛార్జ్ తీసుకోండి : ఇంట్లోనే మిమ్మల్ని మీరు బరువును కొలవడం ఉత్తమమైన పద్ధతి. మీకు బరువు నిర్వహణ గురించిన ఎంత ఎక్కువ అవగాహన ఉంటే, అంత లాభాన్ని పొందగలరు. కావున అవసరాన్ని ఉద్దేశించి మీకు మీరుగానే పరికరాలను సిద్దం చేసుకొనవలసి ఉంటుంది.

2. ఒక నెల లేదా వారానికి ఒకసారి బరువు చూడండి : బరువును సరిగ్గా అంచనా వేయకపోవడం వలన తిరిగి బరువును పొందే అవకాశాలు ఉంటాయి. కావున రోజూ కాకపోయినా వారానికి లేదా నెలకొకసారి బరువును చూసుకోవడం ఉత్తమ మార్గంగా చెప్పబడింది. వ్యాయామానికి పరికరాలను సిద్దం చేసుకున్నట్లే, మీ బాడీ మాస్ ఇండెక్స్, శరీరంలో నీరు మరియు క్రొవ్వులను కొలవడానికి కూడా స్మార్ట్ స్కేల్స్(ఇవి కూడా బరువు తూచే పరికరాలే, కాకపోతే అదనపు ఫీచర్లు ఉంటాయి) మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. బరువు తూయడంతో పాటు ఇన్ని ఫలితాలను పొందగలిగే స్మార్ట్ స్కేల్స్, బరువు తూచే పరికరాలకు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. అవసరమైతే వాటిని కూడా ఆశ్రయించవచ్చు. కొలతల వరకు సాధారణ టేపు సరిపోతుంది

3. లేచిన వెంటనే బరువు చూసుకోవడం మంచిది : ఉదయం పూట మీరు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత , ఎటువంటి ఆహారం తీసుకోని సమయాన బరువు ఎంచడం ద్వారా మీ బరువును ఖచ్చితత్వంతో తెలుసుకొనవచ్చు.

4.బరువును లెక్కించే పరికరం ఎల్లప్పుడూ ఒకటే ఉండేలా చూసుకోండి : ఇది ఎంతో ముఖ్యమైన చర్య, మార్కెట్లో దొరికే బరువుతూచే పరికరాలు కొన్ని అసమాన లక్కలను ఇస్తుంటాయి. అనగా ఒక పరికరంలో 50 కేజీలుగా చూపిన బరువు మరొక పరికరంలో కొన్ని గ్రాములు అటుఇటుగా చూపవచ్చు. కావున ఎల్లప్పుడూ ఒకే పరికరం వాడేలా ఉండండి. మీ శరీరం కొవ్వు మధ్యస్థ స్థాయికి మరియు సన్నదనానికి మధ్య పడినప్పుడు మీబరువు గురించి చింతించాల్సిన అవసరం లేదు. మరియు మీరు విస్తృతమైన చట్రాన్ని కలిగి ఉంటే, మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి మీ అధిక శరీరసాంద్రతకు, స్కేల్స్ ఉత్తమ ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. పైన పేర్కొన్న అన్ని పద్ధతులను మీ ఇంటిలోనే సులభతరంగా లెక్కించవచ్చు.

Comments

comments