health

బ్రెయిన్ డామేజ్ చేసే 8 భయంకర అలవాట్లు..

ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి శరీరంలో అత్యంత కీలకమైన మరియు ముఖ్యమైన అవయవం బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్ అనేది శరీరంలో ప్రతి ఒక్క అనువుని కంట్రోల్ చేస్తుంది. మన ప్రతి ఒక్క ఆలోచన, కదలిక బ్రెయిన్ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే దాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పబోయే 8 అలవాట్లు మన బ్రెయిన్ కి ఎంతో హాని కలిగిస్తున్నాయి. వెంటనే ఈ అలవాట్లను సరిచేసుకుంటే చాలా మంచిది.

  • రోజు రాత్రి 8 నుంచి 9 గంటల దాకా మన శరీరం రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి పొద్దున్న లేవగానే అన్నిటికన్నా ముందు మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. కాబట్టి మన బ్రెయిన్ కి హాని కలగకుండా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు.
  • ఒకప్పుడు స్కూల్, కాలేజీ లేదా ఆఫీస్ నుంచి తిరిగి రాగానే.. కాసేపు చదువుకొని లేదా టీవీ చూసి త్వరగా నిద్రించేవారు. కాని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడంతో.. బెడ్ మీద వాలిపోయి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత పడుకుంటున్నారు. ఈ అలవాటు బ్రెయిన్ కి చాలా హాని కలిగిస్తుంది. రాత్రి 10 లోపు నిద్రించిన తర్వాత… కనీసం 8 గంటల మంచి నిద్ర ఉండాలి. అప్పుడే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది.
  • వీలైనంతవరకు షుగర్ ని మానేయండి. స్వీట్స్ తక్కువగా తినకండి. ఎక్కువ శాతం షుగర్ తింటే మన బ్రెయిన్ కి హాని కలుగుతుంది. షుగర్ వల్ల కేవలం బ్రెయిన్ మాత్రమే కాదు ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి.
  • మన శరీరం అనేది రాత్రి పూట రెస్ట్ తీసుకోడానికి.. పగటి పూట కష్టపడడానికి తగ్గట్టుగా సృష్టించబడింది. కాబట్టి పగటి పూట ఎక్కువ సేపు నిద్రించకూడదు. శ్రుష్టికి విరుద్దంగా పగటి పూట ఎక్కువ సేపు నిద్రిస్తే అది మన బ్రెయిన్ కి హాని కలిగిస్తుంది.
  • మన బ్రెయిన్ కి సరైన పోషణ అందాలంటే భోజనం కరెక్ట్ పద్ధతిలో చేయాలి. టీవీ చూస్తూ, కంప్యూటర్ ముందు కుర్చుని, స్మార్ట్ ఫోన్ లో కాలక్షేపం చేస్తూ భోజనం తినకూడదు.
  • మనం పీల్చుకునే ఆక్సిజన్ ఎక్కువ శాతం బ్రెయిన్ కే చేరుతుంది. కాబట్టి మీ బెడ్ రూమ్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. మన బ్రెయిన్ కి ఎంత ఫ్రెష్ ఎయిర్ అందిస్తే అంత యాక్టివ్ గా ఉంటుంది.
  • చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు నిండా దుప్పటి కప్పుకొని పాడుకుంటారు. అలా చేస్తే మన బ్రెయిన్ కి బయటనుంచి ఫ్రెష్ ఎయిర్ తగలదు. దీనితో పాటు రాత్రి పడుకునేటప్పుడు తలకి క్యాప్, స్కార్ఫ్ లాంటివి ధరించకూడదు. కాళ్ళకి సాక్స్ కూడా వేసుకోకూడదు.
  • యూరిన్ ని బిగపట్టుకుని ఉండడంవల్ల కూడా మన బ్రెయిన్ కి హాని కలుగుతుంది. యూరిన్ బిగపట్టుకుంటే అది మన నెర్వస్ సిస్టం పై ప్రభావం చూపిస్తుంది. వెంటనే ఈ అలవాటుని మానుకోండి.

Comments

comments