news

బ్రేకింగ్: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!!

ప్రముఖ నటుడు, బెనర్జీ తండ్రి రాఘవయ్య (86) మృతి చెందారు. రాఘవయ్య మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయ‌న‌కు ఓ కొడుకు, కుమార్తె. న‌ట‌వార‌సుడు బెన‌ర్జీ టాలీవుడ్‌లో ద‌శాబ్ధాలుగా కెరీర్‌ని సాగిస్తున్నారు. కుమార్తె ప్ర‌స్తుతం చెన్న‌య్‌లోనే స్థిర‌ప‌డ్డారు. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాఘవయ్య పార్దీవ దేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు.

టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు పొందిన రాఘవయ్య.. ‘‘వీరాంజనేయ, కథా నాయకుడు, యమ గోల’’ చిత్రాల్లో నటించారు. చివరగా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్‌ అనే నేను చిత్రంలో ఆయన నటించారు. ఇదే ఆయనకు చివరి సినిమా. రాఘ‌వ‌య్య దాదాపు 50 ఏళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా కొన‌సాగుతున్నారు. మ‌ద్రాసులో వేళ్లూనుకున్న తెలుగు సినిమా, అట్నుంచి హైద‌రాబాద్ షిఫ్ట్ అయిన క్ర‌మంలోనూ సినీరంగంలో న‌టుడిగా కొన‌సాగారు. రాఘవయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర‍్శనార్థం వారి స్వగృహంలో ఉంచారు.

Comments

comments