movies

బన్ని మాస్టర్ ప్లాన్…. మహేష్ రికార్డ్ లకు చెక్ పెట్టటానికి ఏమి చేసాడో చూడండి

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బరిలోకి దిగటానికి సిద్ధం అయ్యిపోయాడు. మే 4 అంటే రేపు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలక్షన్స్ తో దూసుకుపోతున్న భరత్ అనే నేను,రంగస్ధలం సినిమా ధియేటర్స్ ని చేజిక్కించుకుందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1500 లకు పైగా ధియేటర్స్ లో విడుదల చేయటానికి నిర్మాతలు అన్ని సిద్ధం చేసేసారట. అమెరికా,ఓవర్సీస్ లలో కూడా పెద్ద ఎత్తున షో లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను ఆడుతున్న ధియేటర్స్ ని కూడా బన్ని తన సినిమా కోసం వేసుకుంటున్నాడని తెలిసింది. తెలంగాణలో దాదాపుగా 350 ధియేటర్స్ లో నా పేరు సూర్య సినిమాను విడుదల చేస్తున్నారు.

ఇక ఈ సినిమా పక్క రాష్ట్రము తమిళనాడుతో పాటు బన్నికి మంచి మార్కెట్ ఉన్న కేరళ రాష్ట్రంలోనూ విడుదల చేస్తున్నారు. తమిళ డబ్బింగ్ వెర్షన్ దాదాపుగా 150 ధియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఇక కేరళలో అయితే దాదాపుగా 500 ధియేటర్స్ లో బన్ని సినిమాను వేస్తున్నారు.

భరత్ అనే నేను కేవలం తెలుగు,ఓవర్సీస్ లో విడుదల కాగా నా పేరు సూర్య మాత్రం తెలుగు,తమిళం,మలయాళం భాషల్లో కూడా విడుదల అవుతుంది. దీనితో తోలి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే భరత్ అనే నేను సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టటం ఖాయంగా కన్పిస్తుంది.

Comments

comments