health

ఇవి తింటే ముసలి వాళ్ళు అయిపోతారు !!!

కొన్ని ఆహారపదార్ధాల వల్ల మన శరీరం తొందరగా ముసలి తనాన్ని పుంజుకుంటుంది. ఆహారపదార్ధాలు మనకి ఎంత మేలు చేస్తాయో, అంతే కీడు కూడా చేస్తాయని అంటున్నారు నిపుణులు. ఏదైనా మితంగా తింటే ఔషదం, అమితంగా తింటే విషం అనే నానుడి మనకు తెలిసిన విషయమే. కొన్ని ఆహారాలు మనకు ఎలాంటి సాయం చేయకపోగా హాని కల్గిస్తాయి. తొందరగా వృద్దాప్యంలోకి నెట్టేస్తాయి. అలాంటి ఆహారపదార్ధాల వివరాలు..

  • స్వీట్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కాని స్వీట్లు వృద్దాప్యంలోకి నెట్టేయడంలో ముందుంటాయట. వీటివల్ల శరీరంలో గ్లెకేషన్‌ అనే ప్రక్రియ మొదలై శరీరంలోని కణాలు ప్రోటీన్లను గ్రహించడం మానేస్తాయట. ఆ కారణం వల్ల కణాలు రోజురోజుకి బలహీనపడి తొందరగా వృద్దాప్యం రావడానికి తోడ్పడుతుంది.
  • ఆల్కహాల్‌ కి దూరంగా ఉంటే అటు ఆరోగ్యపరంగా, ఇటు సమాజంలో మంచి మర్యాదలను కాపాడుకోవచ్చు. కాలేయం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన చర్మం అంత అందంగా ఉంటుంది. కాలేయం బాగా పనిచేస్తే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళి మీ చర్మం ఎంతో కాంతి వంతంగా మెరుస్తుంది. అదే విధంగా వైన్‌ కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. అందులో ఉండే యాసిడ్స్‌ దంతాలపై ఉండే ఎనామిల్‌ పొరను నాశనం చేసి పళ్ళు ఊడడానికి సహాయపడుతాయి.
  • కాఫీ ఎక్కువగా తాగ కూడదు. ఎందుకంటే చర్మం తేమను కోల్పోతుంది. దానివల్ల చర్మంపొడి బారిపోయి తొందరగా ముడతలు పడడానికి సహాయపడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్‌ను మితంగా కాకుండా ఎక్కువగా తీసుకుంటే శరీరంలో పైబర్‌ స్థాయి పూర్తిగా పడిపోతుంది.
  • ఏదీ పరిమితికి మించి తినకూడదు. అలానే సాల్ట్‌ ఐటమ్స్‌ కూడా.. సాల్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు పేరుకుపోయి ఎంత నీరు తాగినా దాహం తీరదు. అదే విధంగా శరీరంలో నీటి నిల్వలు కూడా పెరగకుండా చూసుకోవాలి. నీటి నిల్వలు పెరిగినా ప్రమాదమే. అందువల్ల మితంగా తీసుకోవాలి.
  • ఏదీ పరిమితికి మించి తినకూడదు. అలానే సాల్ట్‌ ఐటమ్స్‌ కూడా.. సాల్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు పేరుకుపోయి ఎంత నీరు తాగినా దాహం తీరదు. అదే విధంగా శరీరంలో నీటి నిల్వలు కూడా పెరగకుండా చూసుకోవాలి. నీటి నిల్వలు పెరిగినా ప్రమాదమే. అందువల్ల మితంగా తీసుకోవాలి.
  • కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల రక్త కణాలు డైల్యూట్‌ అయిపోయి చర్మాన్ని కాంతి విహీనంగా మారుస్తాయి. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల తొందరగా ముడతలు రావడానికి దోహదపడతాయి.
  • ఏంటి ఉప్పు, కారం, తీపి ఏమి తినకూడదు అంటున్నారు. మరి ఏం తిని బ్రతకాలి అనేకదా మీ ప్రశ్న ? వీటిని తినడం మానక్కర్లేదు లిమిట్‌గా తీసుకుంటే చాలు. అప్పుడు ప్యూచర్‌లో కూడా అన్ని తినగలిగే కెపాసిటి మీకు ఉంటుంది. వీటిలో ఏది ఎక్కువగా తీసుకున్న లైఫ్‌లో కొన్ని రుచులను పూర్తిగా మానుకోవాల్సి వస్తుంది. అన్నింటిని మితంగా తిని లైప్‌లో అన్ని రుచులని ఆస్వాదించండి.

Comments

comments