news

ఛానల్స్ నిషేధంపై నిజం బయట పెట్టిన మెగా బ్రదర్ నాగబాబు

తెలుగు సినీ రంగం Vs న్యూస్ ఛానల్స్ అన్నట్టుగా సాగుతున్న వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసిందని మే 2 వ తేదీ నుంచి ఏ న్యూస్ ఛానల్ కి ఎలాంటి సినిమా కంటెంట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యిపోయారని వార్తలు వచ్చాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే న్యూస్ ఛానల్స్ ఎడిటర్స్ భేటీ అయ్యి ఒక హెచ్చరిక లాంటి నోట్ కూడా జారీ చేసారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి అంటే మే 2 నుంచి న్యూస్ ఛానల్స్ నిషేదించటంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు మెగా బ్రదర్ నాగబాబు.

అసలు తమకు అలాంటి ఆలోచన ఏమి లేదని నాగబాబు ఉవాచ. ఎవరో ఎదో చెప్పారని అవన్నీ పట్టుకొని అనవసర రాద్ధాంతం చేసారని నాగబాబు అభిప్రాయపడ్డారు.

తాము పలు మార్లు చర్చించిన మాట నిజమే అయినా తెలుగు సినీ పరిశ్రమకు ఏమి చేస్తే మంచి జరుగుతుందనే అంశంపై మాత్రమే చర్చ సాగించామని చెప్పుకొచ్చారు. ఇప్పటికి అయితే ఛానల్స్ పై ఎటువంటి నిషేధం లేదని తేల్చి చెప్పారు.

తాను నిర్మాతగా చేసిన నా పేరు సూర్య పై అప్పుడే కొన్ని ఛానల్స్ లో వ్యతిరేక ప్రచారం జరుగుతుందనే వార్తను ఖండించారు. సినిమా చూసిన తర్వాత ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చని, కానీ ఇలా సినిమా విడుదల కాకుండానే ప్రతికూల ప్రచారం చేయటం సరికాదని అన్నారు.

 

Comments

comments