movies

గుండు హ‌నుమంతురావు పొట్టి వీర‌య్య‌ల‌కు చిరంజీవి 4ల‌క్ష‌లు ఆర్ధిక‌ స‌హాయం?

క‌మెడియ‌న్ గుండు హ‌నుమంతురావు అంటేనే ముందుగా గుర్తొచ్చేది “అమృతం” ఈ కామెడీ షో ద్వారా అందరిని ఆకట్టుకున్నాడు.. తన కామెడీతో ఎందరినో నవ్వించిన గుండు హ‌నుమంతురావు తన జీవితంలో లో మాత్రం ఆనందం లేదు.. గుండు హ‌నుమంతురావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ నేప‌థ్యంలో టెలివిజ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యే `అలీతో జాలీ`గా షో ద్వారా గుండు ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి 2ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా ద్వారా అంద‌జేశారు.

`మా` జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, ఎగ్యిక్యూటివ్ మెంబ‌ర్ సురేష్ స్వ‌యంగా అపోలో అసుప‌త్రికి వెళ్లి చెక్ అందించారు. అనంత‌రం గుండు హ‌నుమంతురావు త‌న అనారోగ్యాన్ని సైతం లెక్క చేయ‌కుండా చిరంజీవి గారితో కాసేపు ఫోన్ లో ఉత్సాహంగా మాట్లాడారు.

అదేవిధంగా మరో క‌మెడియ‌న్ పొట్టి వీర‌య్య ఆర్ధిక పరిస్థితి పేప‌ర్లో చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ చ‌దివి చలించిపోయారు.. దీంతో వీర‌య్య కుటుంబానికి కూడా 2ల‌క్ష‌ల రూపాయ‌లు స‌హాయం చేసారు.. ఈ సంద‌ర్భంగా `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ చిరంజీవి గారు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచి గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య క‌ష్టాల్లో ఉన్నట్లున్నారు.

ఇద్దరికి చెరో రెండు లక్షలు ఇవ్వమని చెప్పారని తెలిపారు.. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా…ఎవ‌రు క‌ష్టాల్లో ఉన్నా నాకొచ్చి చెప్పు. స‌హాయం చేద్దాం అన్నారు. ఈ విష‌యంలో నేను `మా` అధ్య‌క్షుడిగానే కాకుండా న‌టుడిగా చాలా సంతోషించాను. హ్యాట్సాఫ్ చిరంజీవి గారు` అని అన్నారు.

Comments

comments

Recent Posts