news

కొబ్బరి బోండాల్లోనూ విష రసాయనాలు !!

కొబ్బరి నీళ్ళు ప్రకృతిసిద్ధంగా లభించే అద్భుత పానీయం. ఒంట్లో వేడి చేస్తే కొబ్బరి నీళ్ళు, జలుబు చేస్తే కొబ్బరి నీళ్ళు, జ్వరం వస్తే కొబ్బరి నీళ్ళు….. ఏ జబ్బుకైనా సర్వ రోగ నివారిణిగా పేరు పొందిన అమృత పానీయం. అదంతా నిన్న మొన్నటి వరకే.. ఎందుకంటే కొబ్బరి పంటల్లోనూ మాయామశ్చీంద్రలు ప్రవేశించాయి. పాలు, నూనెలు, పప్పులు, ఉప్పుల్లా ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా కల్తీ జాబితాలోకి చేరిపోయాయి. అందుకే ఆ నీళ్లు తాగితే రోగాలు తగ్గడం పక్కకు పెడితే… ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

అధిక దిగుబడి కోసం కొబ్బరి రైతులు ప్రాణాలను హరించే రసాయనాలను చెట్టుకు పట్టిస్తున్నారు. కొబ్బరి చెట్టు వేర్లు ఉన్న చోట తవ్వి…. తల్లి వేరును కనిబెడతారు.ఆ తరువాత మోనోక్రోటోఫాస్ (Monocrotophos) అనే కెమికల్ ను ఓ కవర్లో పోసి, కట్ చేసిన తల్లి వేరును అందులో పెట్టి…. ఆపై మట్టి కప్పేస్తారు. ఇలా ఈ కెమికల్ ను బలవంతంగా చెట్టుకు తాగించడం వల్ల…. చెట్టుకు ఉన్న పిందలు బొండాలుగా మారడం చకచకా జరిగిపోతుంది. మోనోక్రోటోఫాస్ అనే కెమికల్ మన శరీరంలోకి చేరితే… అది హార్ట్, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు.

దీని వల్ల వేలల్లో ఎగుమతి చేసే బొండాలు లక్షల్లో ఎగుమతి అవుతున్నాయి. బొండాలు తిరిగి సాధారణ దశకు చేరుకోవాలంటే… వాటిలోని కెమికల్ పూర్తిగా నశించిపోవాలంటే కనీసం 40 రోజులు పడుతుంది. కానీ మనం తాగే బొండాలు ఎన్ని రోజులవో ఎలా చెప్పగలం?? రైతన్నలు ఇలా చేయకుండా…. ఎక్కువ బొండాలు పండడానికి వేప నూనెను కూడా వాడవచ్చు. కానీ వీరు మాత్రం కెమికల్స్ కె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మోనోక్రోటోఫాస్ ను ఎలా అయితే చెట్టుకు పట్టిస్తున్నారో…

అలానే వేప నూనెను పట్టించడం వల్ల కూడా ఎక్కువ బొండాలు వస్తాయి. మరి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం రైతన్నలకు కూడా అలవాటైతే… మనల్ని కాపాడేది ఎవరు??

Comments

comments