movies

కలర్ స్వాతి పెళ్లి చేసుకోబోయే వరుడు ఇతడే…

‘కలర్స్‌’ టీవీ షో ద్వారా స్వాతి బుల్లితెరకు పరిచయమయ్యారు. దాంతో ఆమె ‘కలర్స్‌’ స్వాతిగా పిలువబడ్డారు. స్వాతి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కొంతకాలంగా స్వాతి.. వికాస్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఒకటికానున్నారు. ఆగస్ట్‌ 30న హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటలకు వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 2న కొచ్చిలో వివాహ విందును ఏర్పాటు చేయబోతున్నారట.

వికాస్‌ మలేసియన్‌ ఎయిర్‌లైన్స్ లో పైలట్‌గా పని చేస్తున్నారు. వికాస్‌ స్వస్థలం ఇండోనేషియా రాజధాని జకార్తా. వివాహం తర్వాత స్వాతి తన భర్తతో కలిసి అక్కడే స్థిరపడనున్నారు. ఆ తర్వాత 2005లో వచ్చిన ‘డేంజర్‌’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘అష్టాచెమ్మా’, ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘త్రిపుర‘ తదితర చిత్రాల్లో నటించారు.

Comments

comments