health

రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా?

ఈ ఆధునిక ప్రపంచంలో పని చేయడానికే సమయం సరిపోవడం లేదు. ఇక తిండి తినడానికి సమయం ఎక్కడుంటుంది? ఎప్పుడు తెల్లారుతుందో.. ఎప్పుడు రాత్రి అవుతుందో తెలియడం లేదు అంటుంటారు.. ఎప్పుడు ఏమి తింటున్నామో తెలియదు. సమయాన్ని అదా చేసుకోవడానికి భోజనాన్ని ఎలక్ట్రికల్ లేదా ప్రెజర్ కుక్కర్ లో వండుతున్నారు ఇప్పుడు చాలా మంది. అలా వండిన భోజనం ఎలా ఉందో కూడా చూసుకోకుండా తినేస్తారు. రుచి ఎలా ఉందొ కూడా పట్టించుకోరు. ఎందుకంటే అంత టైం కూడా లేదు. అదే..

కట్టెలపై లేదా బొగ్గులపై వంట చేయడం ఈ తరం వారు ఎప్పుడైనా చూశారా? లేదనే సమాధానం వస్తుంది. ఎందుకో తెలుసా.. ఇప్పుడు ఉండేదంతా ఇరుకు ఇళ్ళల్లో. అక్కడ కట్టెలు వెలిగిస్తే ఇక అంతే. పట్టణాలు, నగరాలు సరే కనీసం పల్లెల్లో కూడా ఇప్పుడు కట్టెపొయ్యిలు కనిపించడం లేదు.

ఎలక్ట్రికల్ లేదా ప్రెజర్ కుక్కర్ లో మీరు రోజు భోజనం వండుకొని తినడం వలన సమయం ఆదా అవుతుందేమో కాని, ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా చెడిపోతుంది. ఎందుకంటే వీటిల్లో వండటం వలన ఆహరం విషంగా మారుతుంది. అల్యూమినియం పాత్రల్లో భోజనం వండటం, నిలవచేయడం శ్రేయస్కరం కాదు.

మన పూర్వీకులు ఎందుకు అంత ఆరోగ్యంగా బలంగా ఉన్నారో తెలుసా.. వారు మట్టి కుండల్లో భోజనం వండుకొని తినేవారు. అలా భోజనాన్ని మట్టి పాత్రలో వండుకోవడం వలన శరీరానికి కావలసిన పోషక పదార్ధాలు లభిస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే.. ఎప్పుడైనా సరే భోజనాన్ని గాలి వెలుతురూ తగిలే విధంగా వండాలి.

అంతేకాని మూసి ఉన్న వాటిల్లో ఎప్పుడు వండటం చేయకూడదు. కాబట్టి కొన్ని రోజులు ఎలక్ట్రికల్ స్టౌవ్ లు పక్కన పెట్టి మట్టి కుండలో వంట చేసుకొని తిని చూడండి.. మీ ఆరోగ్యంలో ఎంత తేడా కనిపిస్తుందో గమనించండి.

Comments

comments