news

శిక్ష పడింది…

దాదాపు ఎనిమిదిన్నరేళ్ల క్రితం కృష్ణా జిల్లా విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. కేసు విచారణలో దోషులుగా తేలిన ముగ్గురు నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌, వెంకటరావుగౌడ్‌లకు న్యాయూర్తి జీవిత ఖైదు విధించారు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అడుగడుగునా ఈ విషాదంలో కన్నీళ్ళే కనపడతాయి.

2010 జనవరి 30న నాగవైష్ణవి తన సోదరుడితో కలిసి కారులో పాఠశాలకు వెళ్తుండగా దుండగులు అడ్డగించి అపహరించారు. ప్రతిఘటించిన కారు డ్రైవరు లక్ష్మణరావును కత్తితో గొంతులో పొడిచి హత్య చేశారు. ఇదే సమయంలో కారులోని నాగవైష్ణవి సోదరుడు తప్పించుకుని పారిపోయాడు. అదేరోజు నాగవైష్ణవిని కారులో విజయవాడ నుంచి గుంటూరు వైపు తీసుకెళ్తూ గొంతు నులిమి హతమార్చారు. మృతదేహం ఆనవాళ్లు కూడా కనిపించకుండా చేసేందుకు గుంటూరు ఆటోనగర్‌లోని ఓ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో నాగవైష్ణవి శవాన్ని పడేశారు.

ఎముకలు కూడా కరిగిపోయేలా మంట మండించి బూడిద చేశారు. బ్లాస్ట్ ‌ఫర్నేస్‌ నుంచి నాగవైష్ణవి చెవిపోగులను సేకరించిన పోలీసులు వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. చెవిపోగుకు వజ్రం ఉండడంతో అదే ఈ హత్య కేసులో కీలక సాక్ష్యంగా మారింది. కారు డ్రైవరు హత్య సమయంలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చారు. అపహరించిన చిన్నారిని అత్యంత దుర్మార్గంగా హతమార్చారనే సంగతి బయటకు రావడంతో నాగవైష్ణవి తండ్రి పలగాని ప్రభాకర్‌ ఆ బాధను తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. విచారణ క్రమంలో న్యాయం కోసం పోరాడుతున్న చిన్నారి తల్లి, బాబాయి మరణించడం అత్యంత హృదయ విదారకరం. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ 79 మంది సాక్షులను, డిఫెన్స్‌ 30 మంది సాక్షులను ప్రశ్నించింది.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment