news

రైల్వే ప్ర‌యాణికులకోసం సుప్రీం సంచ‌ల‌నం నిర్ణ‌యం

రైలు ప్ర‌మాదంపై సుప్రీం కోర్టు సంచ‌ల‌నం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంపై రైల్వే ప్ర‌యాణికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సాధార‌ణంగారైలు ప్రయాణాల్లో ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. రైల్వే ట్రాక్ లు దాటే స‌మ‌యంలో, రైలు ఎక్కే స‌మ‌యంలో ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఆ ప్ర‌మాదాల‌పై రైల్వే శాఖ ప్ర‌యాణికుడి నిర్ల‌క్ష్యం అంటూ న‌ష్టం ప‌రిహారం చెల్లించేది కాదు.

అయితే రైల్వే ప్ర‌యాణికుల‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు చెల్లించాల్సిన న‌ష్ట‌ప‌రిహారంపై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టించింది. ఈ విచార‌ణ‌లో రైలు ప్ర‌మాదంలో ఏ చిన్న ప్ర‌మాదం జ‌రిగినా దానికి బాధ్య‌త వహించాల్సింది రైల్వేశాఖేన‌ని జస్టిస్ ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువ‌రించింది.
ఇదిలా ఉంటే  రైల్వే చట్టం 1989 సెక్షన్ 124 ఏ ప్రకారం ప్ర‌యాణంలో గాయ‌ప‌డ్డ బాధితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి. కానీ అవేం చెల్లించ‌ని రైల్వే శాఖ కుంటిసాకులు చెబుతూ ప‌బ్బం గ‌డిపేస్తుంది.

అయితే తాజా సుప్రీం తీర్పుతో ఇకపై ప్రమాదాలు జరిగితే పరిహారం రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని సుప్రీం తీర్పు ఆదేశించింది. ప్రయాణికుల నిర్లక్ష్యం అనేది పరిహారాన్ని తిరస్కరించడానికి సాకుగా చూపించే కారణాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. ఈ చట్టం ప్రకారం కేవలం రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఆత్మహత్నాయత్నం, ఆత్మహత్య పాల్పడిన సమయంలో గాయాలైనా, ప్రాణాలు కోల్పోయినప్పుడు మాత్రమే పరిహారం అందజేయరాదు.

Comments

comments