Sports

ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టి అందరిని ఆశ్చర్యనికి గురిచేసిన్ యువ క్రికెటర్.

అండర్‌-15 మురళీ గుడ్‌నెస్‌ కప్‌ ఫైనల్లో భాగంగా ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఆడుతున్న నవీందు పహసర (89 బంతుల్లో 109) ఈ ఫీట్‌ సాధించాడు. ఒక బంతి నోబాల్‌ కావడంతో ఆ కుర్రాడు ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టడం సాధ్యమైంది. లంక మాజీ స్పిన్నర్‌ మురళీధరన్‌ తన ఫౌండేషన్‌ తరఫున ఈ టోర్నీ నిర్వహిస్తున్నాడు. నవీందు అద్భుత ఇన్నింగ్స్‌తో కొట్టావాపై ఎఫ్‌ఓజీ విజయం సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

విశాస్త్రి, యువరాజ్‌ సింగ్‌, హెర్ష్‌లీ గిబ్స్‌ వీరంతా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు. అయితే తాజాగా భారత్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా ఆరు సిక్సర్లు సాధించి వారి సరసన నిలిచాడు. సౌరాష్ట్ర టీ20 టోర‍్నమెంట్‌లో జడేజా ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా, వీరిని తలదన్నేలా శ్రీలంకకు చెందిన టీనేజర్‌ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇలా ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టడం ఏ ఫార్మాట్‌ క్రికెట్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం.

Comments

comments

Recent Posts