news

దేవాలయాల్లో తీర్థం మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి ?

తీర్థం యొక్క విశిష్టత

తీర్థం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలయంలో దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం. కానీ తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలని, అలానే ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది.
రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.


పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత శ‌క్తి వస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది. ఆరోగ్యం, ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుందనే సద్భావంతో స్వీకరించాలి.

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.

రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.

ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.

మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.

దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు.

అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!

మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కాని అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.

 

Comments

comments

Recent Posts