news

వ్యక్తిత్వంపై పవన్ – కత్తి ట్విట్టర్ వార్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కొన్నాళ్లు కత్తి మహేష్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసింది. ఇతని వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయటం.. వాళ్లకి కౌంటర్ ఇవ్వటం రొటీన్ గా జరుగుతుంది. ఎట్టకేలకు కత్తిపై తన వైఖరిని ట్విట్ ద్వారా తెలియజేశారు పవన్ కల్యాణ్. దీనికి మళ్లీ కత్తి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా ఉన్న వార్.. ఇప్పుడు గ్రౌండ్ లోకి దిగింది.

పవన్ కల్యాణ్ ట్విట్ : వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు.. నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు  అంటూ ఓ మెసేజ్ ను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలియదు గాని.. గౌరవనీయ స్థానంలో ఉన్న, ఓ సీనియర్ జర్నలిస్టు తనను ఈ విధంగా గ్రీట్ చేశారంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీన్ని షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పారు. మరో ట్విట్ లో ప్రస్తుత పరిస్థితుల్లో కులం, పవర్ పాలిటిక్స్ పోషిస్తున్న పాత్ర ప్రమాద ఘంటికలను మోగిస్తోందని.. ఇది మన ఆర్థిక మందగమనానికి కారణం కావడమే కాక, సమాజానికి అత్యంత కీడును కలగజేస్తుంది అని చెప్పారు.

కత్తి కౌంటర్ : ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ & గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టే గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా.. అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!!!” అంటూ కామెంట్ చేశాడు.

ఇన్నాళ్లు ఓపికతో ఉన్న పవన్.. ఇండైరెక్ట్ గా కత్తికి కౌంటర్ వేయటంతో ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. ఇక నుంచి ఇలాంటి వైఖరితోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Comments

comments

Recent Posts