news

మార్కెట్ లోకి విచ్చలవిడిగా “నకిలీ కండోమ్స్

అవును మీరు వింటున్నది, చూస్తున్నది, అక్షరాల నిజమే ఈరోజుల్లో ప్రతి వస్తువు కల్తీ కల్తీ.. ఉప్పు, పప్పు, నేనే, కారం ఏదైనా కల్తీ లేకుండా వినియోగ దారుడి చేతిలోకి రావడం లేదు. చివరకు రక్షణగా వాడే కాండోమ్స్ ను కూడా కల్తీ మాఫియా తయారు చేస్తుంది. ఈ వ్యవహారం గుంటూరు జిల్లా నుండి జరుగుతుంది. వీటిని పట్టుకోవడం కోసం నకిలీ లేని వస్తువును చూపిస్తే ప్రత్యేకంగా బహుమతి ఇస్తామని ప్రకటించే పరిస్థితి నెలకొంది.

నకిలీ అనేది ఇప్పటివరకు ఆహార పదార్దాలనే చూసి ఉంటాం కానీ ఈ జాబితాలో కండోమ్‌లు కూడా చేరడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరులోని ఆటోనగర్‌, నరసరావుపేటలోని శ్రీరామ్‌నగర్‌, కోట సెంటర్‌లలో నకిలీ కండోమ్‌ల తయారీ కుటీర పరిశ్రమల్లా చురుగ్గా ఉన్నట్లు సమాచారం. దాదాపు 20 కుటుంబాలు ఈ పనిలోనే ఉన్నాయని తెలుస్తోంది. వీరంతా కలిసి రెండు రకాలుగా నకిలీ కండోమ్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.వివిధ కంపెనీల పేర్లను లోగోలను వేస్తూ అందులో నకిలీ కండోమ్‌లు పెట్టి అమ్మేస్తున్నారు.

కనీసం పది రూపాయలు కూడా విలువ చేయని కండోమ్‌లను రూ.200లకు అంటగడుతున్నారు. పరీక్షగా చూస్తేగానీ తెలియనంతగా అక్రమార్కులు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. బ్రాండ్‌ అయితే దానిపై తయారీ, గడువు ముగిసే తేదీలు ఉంటాయి. కొనుగోలుదారులు అవేమీ చూడకుండా దుకాణదారు ఇచ్చిందే తడవుగా జేబులో పెట్టుకుని వెళ్లిపోతూ. ఎయిడ్స్‌ వంటి భయంకర రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికి వీటిని ఉపయోగించిన వారు చాలా మంది ఉంటారని తెలుస్తుంది.

Comments

comments