news

బట్టలు విప్పి తినాలి, లేకుంటే భోజనం లేదు …!

ఫాషన్ ప్రపంచానికి పుట్టినిల్లు ఫ్రాన్స్. ఎన్నో రకాల ఫాషన్ అక్కడి నుంచి ప్రపంచానికి వచ్చింది. ఎఫ్ టీవీ అక్కడిదే. ఇప్పటికి అక్కడ ఎన్నో ఫాషన్ షో లు జరుగుతుంటాయి. పారిస్ అంటేనే ఫాషన్ అని అర్ధం. ఫాన్స్ లో బీచ్, రెస్టారెంట్ లకు కరువులేదు. పదుల సంఖ్యలో న్యూడ్ బీచ్ లు అక్కడ కనిపిస్తాయి, వందల సంఖ్యలో న్యూడ్ స్విమ్మింగ్ ఫూల్స్ దర్శనం ఇస్తాయి. నగ్నంగా మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం కోసం. శరీరాన్ని నిత్యం బట్టలతో కప్పేయడం వలన శరీరం రోగాల బారిన పడుతుంది. మనం కనీసం స్నానం చేసే సమయంలో కూడా లో దుస్తులు ధరించే స్నానం చేస్తుంటారు.

అయితే, కొందరు స్నానం చేసే సమయంలో ఒంటిమీద బట్టలు ఉంచుకోరు. దీనినే ఫ్రెంచ్ బాత్ అంటారు. ఇక ఇటీవలే ప్యారిస్ లో ఓ రెస్టారెంట్ ఓపెన్ అయింది. రెస్టారెంట్ కదా ఓపెన్ అయింది దీనికి ఇంత హడావుడి ఏమిటి అంటారా.. అక్కడికే వస్తున్నా. ఇది ఓ స్పెషల్ రెస్టారెంట్. ఇందులో విందు ఆరగించాలి అనుకునే వారు న్యూడ్ గా మారాలి.

వావ్ సూపర్ కదా, ఈ రెస్టారెంట్ పేరు నేచురల్ రెస్టారెంట్. ప్రకృతి ప్రేమించేవారు, ఆరాదించేవారి కోసం ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ కు వచ్చే అతిదుల కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తారు. లోపలి ఎంటర్ కాగానే సిబ్బంది వారికి లాకర్లు చూపిస్తారట. అక్కడికి వెళ్లి తమ బట్టలను విప్పేసి నగ్నంగా మారిపోయి లోపలి వెళ్లి విందు తీసుకుంటారు.

ఇక కొంతమందికి తమ ప్రైవేట్ భాగాలను చూపించేందుకు ఇష్టపడరు. వారికోసం చిన్న న్యాప్ కిన్స్ ఇస్తారు. దీనితో వాటిని కప్పుకోవచ్చు. ఇక్కడ 40 మంది అతిధులు కూర్చొని హ్యాపీగా తినవచ్చు.ఇక ఇక్కడ ధర 30 యురోల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రెస్టారెంట్ గురించి బయట తెలిసినా.. గట్టి బందోబస్తు ఉంటుంది కాబట్టి పెద్దగా గందరగోళం వంటివి జరగవట. వెరైటిగా ఉన్నది కదూ ఈ రెస్టారెంట్. ఎప్పుడైనా మీరు ప్యారిస్ వెళ్తే.. ఈ రెస్టారెంట్ కు తప్పని సరిగా వెళ్ళండి.

Comments

comments