news

నేల‌పై కూర్చునే భోజ‌నం చేస్తే ఆరోగ్యం ఎందుకో తెలుసా..?

బ‌ఫెట్ డిన్న‌ర్‌లు, డైనింగ్ టేబుల్‌ లాంటివి వచ్చాకా నేలపై కూర్చుని భోజనం చేసేవాళ్ళు తగ్గిపోయారు. కానీ ఒక‌ప్పుడు మాత్రం అలా కాదు. ఎవ‌రైనా నేల‌పైనే కూర్చుని భోజ‌నం చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండే వారు. నేలపైన కూర్చుని తింటే ఆరోగ్యం ఎంటంటారా?

కుర్చీలో కూర్చుని తిన‌డం క‌న్నా నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తేనే మ‌న‌కు ఎక్కువ లాభం క‌లుగుతుంద‌ట‌. ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నేల‌పై కూర్చోవ‌డం వ‌ల్ల యోగాలో సుఖాస‌నం వేసిన‌ట్టు అవుతుంది. ఈ క్ర‌మంలో ఆ భంగిమ‌లో ఉండి తినేట‌ప్పుడు మాటి మాటికీ ముందుకు వంగుతాం క‌దా. అలా వంగే సంద‌ర్భంలో జీర్ణ‌కోశం వ‌ద్ద ఉండే కండ‌రాలు సాగిన‌ట్టు అవుతాయి. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అందుకే నేల‌పై కూర్చుని తిన‌డం మంచిది.

2. నేల‌పై కూర్చుని తింటే త్వ‌ర‌గా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. అది బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

3. నేల‌పై కూర్చుని తిన‌డం వ‌ల్ల వెన్నెముక‌, పొట్ట‌, పిరుదులు వంటి భాగాలతోపాటు ఆయా ప్రాంతాల్లో ఉండే అవ‌య‌వాల‌న్నీ ఉత్తేజిత‌మ‌వుతాయి. వాటికి శ‌క్తి స‌రిగ్గా అందుతుంది. అంతేకాదు, జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు ఉండవు.

4. నేల‌పై కూర్చుని తిన‌డం వ‌ల్ల వెన్నెముక దృఢంగా మారుతుంద‌ని చెప్పుకున్నాం క‌దా. దీని వ‌ల్ల వృద్ధాప్యంలోనూ త్వ‌ర‌గా వెన్నెముక స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. దీంతో వెన్ను నొప్పి కూడా రాదు.

5. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల గుండెకు ర‌క్త స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. దీంతో గుండె జ‌బ్బులు రావు. అదే కుర్చీలో కూర్చుని భోజ‌నం చేస్తే ర‌క్త స‌ర‌ఫ‌రా కేవ‌లం కాళ్ల‌కు మాత్ర‌మే జ‌రుగుతుంది. అది అంత మంచిది కాదు.

Comments

comments