news

కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తెలుతాయో తెలుసా …!

పాడైన గుడ్లు మాత్రమే కాదు , ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటి్లో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకి , కుళ్ళిపోయిన గుడ్డుకి సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణము . సాధారణముగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా వుంటుంది . ఈ కారణముగా అది నీటిలో మునుగుతుంది . కుళ్ళిపోయిన గుడ్డుకూడా అదే పరిమాణములో ఉన్నప్పటికీ దానిలో నుండి కొన్ని బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్ళిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది.

ఎదైనా ఒక వస్తువు యొక్క ఘన పరిమాణము తగ్గకుండా , దాని ద్రవ్యరాశి మాత్రం తగ్గిందీ అంటే దానర్ధము ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే . ఉదాహరణము .. ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బందించామనుకుందాం . అప్పుడు ఆ పాత్ర సాంద్రత కేవలము 5-6 కోట్ల గాలి కణాలను మాత్రమే బందించామనుకుందాం . పాత్ర అలాగే ఉన్నప్పటికీ , లోపలి గాలి తీసేస్తే .. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్ళిన గుడ్డు విషయములోనూ ఇలాగే జరుగుతుంది . కుళ్ళిన గుడ్డుసాంద్రత నీటి సాంద్రత కన్న తక్కువగా వుండటం వల్ల అది నీటి లో తేలుతుంది. . ఈ సందర్భముగా మనము మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాలి .ఒకవేళ కోడిగుడ్డుని చిక్కని ఉప్పునీటిలో వేసినట్లైతే గుడ్డు కన్నా ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా వుండె కారణముగా మనము నీటిలో వేసిన గుడ్డు మంచిదైనా , పాడైనదైనా అది ఉప్పునీటిలో తేలుతుంది.

 

Comments

comments