health

ఉదయము నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు. ఎందుకు?

మానవుని శాస్త్ర జ్ఞానము అంతగా అభివృద్ధి చిందని కాలములో ఋషులు , మునునులు ఆన్ని అరోగ్య సూత్రాలను ఆత్యాద్మికము గా రూపొందించారు . వైద్య రంగము అంతగా అభివృద్ధి చెందని కాలములో సుచి , శుబ్రత , వ్యాధినిరోదకత అన్నీ దైవకార్యాలరూపములో ఉండేవి . పుణ్యము , పురుషార్ధము వస్తుందంటే సామాన్యప్రజలు ఆనురిస్తాననేదే ముఖ్యాంశము . ” అది చేస్తే ఆరోగ్యము … ఇది చేస్తే అనారోగ్యము— అలా చెబితే చాదస్తము గా కొట్టిపారేస్తారు ” కాని అందులో ఎంతో ఆరోగ్యము , ఉత్సాహము దాగిఉన్నాయి . నిద్రలేవగానే రెండుచేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతులలో్ని ఉష్ణశక్తి , వేడి కళ్ళకు తగిలి కళ్ళలోని రక్త ప్రసరణ ఎక్కువై ఆరోగ్యవంతంగా తెజోవంతము గా ఉంటాయి. కళ్ళజబ్బులకు దూరముగా ఉండవచ్చును . కళ్ళ అద్దాల అవసము అంతతొందరగా రాదు . ఇది వైద్యశాస్త్రము చెప్పిన ఆరోగ్యసూత్రము .

కాని ఋషులు ఏమిచెప్పారు :

చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండ చూడడం ద్వారా బ్రహ్మను పూజించినంత ఫలితము ఉంటుందని , బ్రహ్మజ్ఞానము కలుగుతుందని … అలా ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము సంప్రాప్తిస్తుందని లింకు పెట్టేరు .

Comments

comments