health

ముఖం పై ఏర్పడిన మచ్చలను నివారించేందుకు, నిమ్మ + సీసాల్ట్ స్క్రబ్

మీ ముఖం పై ఏర్పడిన మచ్చలను తొలగించేందుకు రకరకాల ఫ్యాన్సీ కాస్మటిక్స్‌ను & ఎక్స్ఫోలియేషన్ బాడీ స్క్రబ్‌ను కొనుగోలు చేయటానికి మీరు ఎంతో డబ్బును ఖర్చు చేస్తుంటారు. కానీ మీరు మీ స్వంతంగానే సమర్థవంతంగా పనిచేసే స్క్రబ్‌ను మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ పనితనంలో వేరే ఏదీ సాటిరాదు.మీ ఇంటి వంటగదిలో సులభంగా దొరికే కొన్ని వస్తువులతో మీ చర్మాన్ని సంరక్షించుకోవడానికి చాలా శక్తివంతమైన, సమర్థవంతమైన స్క్రబ్‌ను చాలా సులభమైన పద్ధతిలో తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా !

అయితే, ఇలా తయారుచేసుకున్న స్క్రబ్, మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ – మీ చర్మంపైనే తిష్ట వేసుకుని వున్న డార్క్ స్పాట్స్‌ను & మచ్చలను తొలగించడంలో అత్యంత ప్రభావశీలిగా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకొన్న ఈ రెసిపీ మీ అవసరాలకు అనుగుణంగా, మీ అందాన్ని పెంపొందించేందుకు అనుకూలమైనదిగా ఉంటుంది.

ఈ స్క్రబ్‌ని తయారు చేయడానికి మీకు కావలసిన పదార్థాలు :-

1. సముద్రపు ఉప్పు / ఎప్సోమ్ సాల్ట్

2. నిమ్మరసం

3. ఆలివ్ ఆయిల్

4. లావెండర్ (ఆప్షనల్‌గా)

సముద్రపు ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు :-

ఈ ఉప్పు మీ చర్మాన్ని లోలోపల నుంచి బాగా శుభ్రం చేస్తుంది, అంతేకాకుండా మీ చర్మాన్ని విచ్చిన్నం చేసి మొటిమలను ప్రేరేపించే బ్యాక్టీరియాలను & ఇతర క్రిములను అడ్డుకొని మీ చర్మం ఆరోగ్యంగా ఉండేలా సంరక్షిస్తుంది. ఈవిధంగా సముద్రపు ఉప్పు మీ చర్మాన్ని రక్షించడంలో తనదైన పాత్రను పోషిస్తుంది. ఇది తక్షణమే మీ చర్మంలోకి శోషించబడి & మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది, అంతేకాకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మంపై ఉన్న వాపును తగ్గించి, మీ కండరాలను సడలిస్తుంది.

నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు :-

నిమ్మరసం, బ్లీచింగ్ వంటి వైట్నర్ వలే పనిచేస్తుంది,

అంతేకాకుండా ఇది మీ చర్మం పైపొరను & చేతి గోళ్ళను తెల్లగా మార్చడమే కాక, వయస్సు ఆధారితంగా మీ ముఖంపై ఉన్న డార్క్ స్పాట్స్‌ను నెమ్మదించేలా చేస్తోంది. ఇందులో ఉండే సువాసన మిమ్మల్ని ఎల్లప్పుడు తాజాగా ఉంచుతుంది.

ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు :-

ఇది మీ జుట్టును ఎల్లప్పుడూ సిల్కీగా, స్మూత్‌గా ఉండేటట్లుగా చేస్తుంది కానీ, జిడ్డుగా మాత్రం ఉంచదు.

లావెండర్ వల్ల కలిగే ప్రయోజనాలు :-

ఇది మీలో మీకు ఉపశమనాన్ని, విశ్రాంతిని కలుగచేసేందుకు మీకు సహాయం చేస్తుంది. ఇటువంటి హెర్బ్స్ సాధారణంగా చర్మ సంరక్షణలో మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తాయి.

స్క్రబ్ తయారీకి పైన తెలిపిన పదార్థాలను సరైన నిష్పత్తిలో తీసుకోవాలి :-

2 టేబుల్ స్పూన్ల ఎప్సోమ్ సాల్ట్,

2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె,

ఒక పూర్తి నిమ్మకాయ నుంచి సేకరించిన రసం,

సువాసన కోసం లావెండర్ (తగినంత)

స్క్రబ్‌ను తయారుచేయు విధానం :-

1. ఒక శుభ్రమైన గిన్నెలో ఎప్సోమ్ ఉప్పును తీసుకుని, దానికి ఆలివ్‌నూనెను మిక్స్ చేసి బాగా కలపాలి.

2. ఇలా తయారుచేసుకున్న మిశ్రమానికి తాజా నిమ్మరసాన్ని అదనంగా కలపాలి.

3. ఈ పదార్ధాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

4. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని భద్రపరచడానికి మూత బిగువుగా వుండే కంటైనర్‌లో భద్రపరుచుకోవాలి.

5. మీరు ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందటం కోసం ఇలా తయారుచేసుకున్న స్క్రబ్‌ను ప్రతిరోజు ఉపయోగించాలి.

ఈ స్క్రబ్ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు & పాటించవలసిన కొన్ని చిట్కాలు :-

మీరు తయారుచేసుకున్న స్క్రబ్ మిశ్రమము యొక్క పైభాగాన్ని లావెండర్ హెర్బ్‌తో కప్పి ఉంచాలి, మీరు ఈ స్క్రబ్‌ను ఉపయోగించే ముందు దానిని బాగా కదలించి అందులో కాస్త నిమ్మరసాన్ని జోడించాలి. ఇలా మీరు చేయడం వల్ల అందులో ఉన్న సమ్మేళనాలు బాగా కలిసి మీ చర్మం పైన సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.

ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని శుభ్రంగా ఉన్న జార్లో నిల్వ చేసుకోవాలి. ఆ జార్ పై అమర్చే మోత చాలా బిగుతుగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు ఈ మిశ్రమాన్ని సురక్షితంగా వాడవచ్చు. వారానికి ఒక్కసారి దీనిని ఉపయోగించడం వల్ల ప్రకాశవంతమైన మృదువైన చర్మాన్ని సులభంగా పొందవచ్చు.

మీ చర్మంపై ఉన్న మృతకణాలను నిర్మూలించి, మరింత సహజమైన కాంతిని పెంపొందించేలా చేయడంలో ఈ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది.

ఇంతటి శక్తివంతమైన, సమర్థవంతమైన స్క్రబ్ వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి, ఇవి మీ చర్మం లోపల వున్న వ్యర్ధ అన్ని మరియు మృతకణాలను నివారించడంలో సహాయం చేస్తుంది.

ఇంతటి గొప్ప ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ స్క్రబ్‌ను మీ ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇది మీ శరీరంపై కొత్త చర్మకణాలను ప్రేరేపించేలా చేసి, మరింత అందమైన కాంతివంతమైన కొత్త చర్మాన్ని ఏర్పరిచేలా చేయడంలో సహాయపడగలదు.

ఈ స్క్రబ్ తయారీ విధానంలో లాభదాయకమైన హెర్బ్స్‌ను ఉపయోగించడం ద్వారా మీరు కొత్త ప్రయోగాలను చేయవచ్చు. ఇలాంటి కొత్త ప్రయోగాల ద్వారా మీరు తయారు చేసుకునే స్క్రబ్‌తో మరింత మంచి ఫలితాలను పొందవచ్చు.

మీ చర్మ సౌందర్యాన్ని సంరక్షించే రెడీమేడ్ రసాయనిక ఉత్పత్తులపై చేసే అనవసరమైన ఖర్చులను తగ్గిస్తుంది. మీ చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఉపయోగించే ఇలాంటి రసాయనిక ఉత్పత్తుల వల్ల కలిగే ఉత్తమ ఫలితాలలో మంచి కన్నా చెడు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బయట షాపుల్లో మీ చర్మ సౌందర్యాన్ని సంరక్షించేందుకు లభ్యమయ్యే రెడీమేడ్ ప్రొడక్ట్స్ వినియోగం పట్ల మీరు తగిన జాగ్రత్తలను వహించాలి.

Comments

comments