news

ఫేస్ బుక్ మీ నగ్న ఫోటోలు అడుగుతుంది !!

ఫేస్ బుక్ ఇలా అడుగుతోంది. మీకు ప్రాబ్లెం రాకుండా ఉండాలంటే, మీ నగ్న చిత్రాలను మీరే పంపించండి అంటూ యూజర్స్ ను కోరుతోంది. ఇదేం విచిత్రం? అలా ఎందుకు అడుగుతోందని డౌట్ వచ్చిందా..అయితే విషయంలోకి వెళ్దాం రండి..!ఒక సంప్రదాయం, కట్టుబాటు లేని విదేశాల్లో విచ్చలవిడి అలవాట్లు చాలా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి రివెంజ్ పోర్న్. అమ్మాయి గానీ, అబ్బాయి గానీ వారి భాగస్వామితో గొడవలు పడి విడిపోతే, ఆ తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి సదరు భాగస్వామికి సంబంధించిన నగ్నచిత్రాలను ఫేస్ బుక్ లో, ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడమే ఈ రివెంజ్ పోర్న్. ఇలాంటి దౌర్భాగ్యపు అలవాట్లు విదేశాల్లో చాలానే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఇది చాలా ఎక్కువగా ఉందట. దాంతో ఫేస్ బుక్ కు కంప్లైంట్ చేస్తున్న బాధితుల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతూపోతోంది. దీన్ని నివారించడానికి ఫేస్ బుక్ ఒక కొత్త ప్లాన్ వేసింది.

 

ఫేస్ బుక్ తనకున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాడి, ఈ సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా, ఎవరైతే తమ భాగస్వామి రివెంజ్ తీర్చుకుంటారని భయపడుతున్నారో, అలాంటి వారు తమ నగ్న చిత్రాలను తమ మెసేజ్ ఇన్ బాక్స్ కే పంపించుకోవాలట. ఆ తర్వాత ఫేస్ బుక్ ఇంటిలిజెన్స్, ఆ ఫోటోను గుర్తించి, వేరే ఎకౌంట్స్ నుంచి అదే ఫొటో కనుక అప్ లోడ్ అయితే, వెంటనే డిలీట్ చేసేస్తుందట. వచ్చే రిజల్ట్ బాగానే ఉంది కానీ దానికోసం చేసే పనే బాలేదంటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.

Comments

comments

Recent Posts