news

హైదరాబాద్ లోని ప్రముఖ షాపింగ్ మాల్ అన్నీ ఫ్రీ… కిటకిట లాడుతున్న జనం

ఫ్రీ, ఫ్రీ ఫ్రీ అని మాట నిజానికి ఒకసారి అనాల్సిన ఈ అక్షరాన్ని ఒక్కసారిగా ఫ్రీ అంటే ఎంతో మంది నోట్లో నుంచి ఎన్నో సార్లు అలా ప్రీ ప్రీ ప్రీ… అంటూ వినిపిస్తూనే ఉంటుంది. ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన బ్రాండ్ ఫ్యాక్టరీ తాజాగా ఇలాంటి ఒక ఆఫర్ తో వచ్చింది. దీనితో హైదరాబాద్ లో అందరూ ఈ షాప్ పై నే దృ

ష్టి పెట్టారు.

 

ఈరోజు కనీసం సెలవు రోజు కూడా కాకపోయినా, ఇసకేస్తే రాలనంత జనం బ్రాండ్ ఫ్యాక్టరీ షాప్స్ కు లైన్ కట్టేశారు. నగరంలోని అన్ని బ్రాండ్ ఫ్యాక్టరీ షాపుల వద్ద తిరునాళ్లలో దైవదర్శనానికి వెళ్లినప్పుడు పెట్టినట్టు, ఈలకర్రలతో క్యూలైన్స్ ఏర్పాటు చేసింది యాజమాన్యం. అక్కడకు వెళ్లి చూస్తే పరిస్థితి మీకు బాగా అర్ధం అవుతుంది. ఫ్రీ ఆఫర్ వచ్చిందంటే, ఇండియాలో జనాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు.

ఏదైనా ఫ్రీ అనో, భారీ డిస్కౌంట్ అనో బోర్డ్ పెడితే, ఇక ఆ షాపు వాడి పంట పండినట్టే. తెలివైన వ్యాపారవేత్తలు ఎవరైనా చెయ్యాల్సిన పని ఇదే. రీసెంట్ బెస్ట్ ఉదాహరణ జియోనే.ఐదువేల రూపాయల విలువైన షాపింగ్ చేసి, కేవలం రెండు వేలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. పైగా ఆ చెల్లించిన రెండు వేల రూపాయలను కూడా కూపన్ల రూపంలో, మరొకటి కొనుక్కునే క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి ఇచ్చేస్తోంది. అందుకే దీన్ని ఫ్రీ షాపింగ్ ఆఫర్ అని పేరు పెట్టింది బ్రాండ్ ఫ్యాక్టరీ..!ఆఫర్ బాగుంది కదా అని వెల్లిపోదాం అని అనుకుంటున్నారా? వెళ్ళండి కాని, సినిమా టికెట్ కొనుక్కున్నట్టు, దీనికి కూడా టిక్కెట్ కొనుక్కుని అప్పుడు లోపలికి వెళ్ళాలి

షాపులోకి ప్రవేశించాలంటే, ముందుగానే ఆన్ లైన్ లో ఉన్న రూ.100 లేదా రూ.250 క్యాటగిరీలో ఎంట్రీ టికెట్ కొనుక్కోవాలి. 250 రూపాయల టికెట్లో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకూ సమయం ఉంటుంది.ఇక 100 రూపాయల టికెట్ క్యాటగిరీలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ సమయం ఉంటుంది. మరి ఎక్కువ టైమ్ ఉన్నది తక్కువ సేపే ఎందుకు పెట్టాడు అన్న డౌట్ కూడా మీకు వచ్చి ఉండచ్చు. ఎందుకంటే, ఫ్రెష్ స్టాక్ ఉదయం 250 రూపాయల టిక్కెట్ తీసుకున్న వారికే దొరుకుతుంది. ఈ ఆఫర్ నవంబర్ 22 నుంచి 26 వరకు ఉంది.

Comments

comments