health

శృంగార సామర్థ్యంను రెట్టింపు చేసే పండ్లు !

ఇటీవల స్త్రీ పురుషల్లో శృంగార వాంచ తగ్గుతుందని ఒక సర్వేలో వెళ్లడైంది. పని ఒత్తిడితో పాటు పలు కారణాలు శృంగారంపై ఆసక్తిని తగ్గిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. కొన్ని సంవత్సరాల క్రితంతో పోల్చితే ఇప్పుడు శృంగారంలో సుఖం చాలా తగ్గిందని వారు అంటున్నారు.

గతంలో స్త్రీ పురుషులకు శృంగార వాంచ్చ ఎక్కువగా ఉండటంతో పాటు వారిలో స్టామినా ఎక్కువ ఉండి శృంగారంను ఎక్కువగా ఎంజాయ్‌ చేసేవారు. పురుషులు కొన్ని సంవత్సరాల ముందు వరకు శృంగారంలో చాలా ప్రభావం చూపే వారు. కాని ఇప్పుడు పలు కారణాల వల్ల కనీసం భాగస్వామిని సంతృప్తి పర్చడంలో విఫలం అవుతున్నారు.

తినే ఆహారంతో పాటు, చేసే పని కారణంగా కూడా శృంగారంలో సత్తా చాటలేక పోతున్నట్లుగా సర్వేలో వెళ్లడైంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారు మానసిక ఒత్తిడి మరియు ఇతరత్ర కారణాల వల్ల శృంగారంపై ఆసక్తిని వ్యక్తం చేయడం లేదు. అలా ఆసక్తి లేకుండా శృంగారంలో పాల్గొనప్పుడు వారు సంతృప్తిని పొందలేరు.సంతృప్తి లేని శృంగారంలో పాల్గొనేందుకు ఎక్కువ శాతం జంటలు ఆసక్తి చూపడం లేదు. నామమాత్రంగా, ఏదో మొక్కుబడిగా దాదాపు 70 శాతం జంటలు శృంగారంలో పాల్గొంటున్నారు.

పని ఒత్తిడి ఉన్నా మరెలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా శృంగారంలో పాల్గొనడం వల్ల మానసిక ఆనందం మరియు శారీరక దృడత్వం కుగుతుంది.అయితే ఆ శృంగారం అనేది సంపూర్ణంగా, సంతృప్తికరంగా, ఆనందదాయకంగా ఉండాలి. అలా శృంగారం జరగాలి అంటే పరుషులు ఈ 5 పండ్లను తినడం వల్ల అద్బుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు ఆ 5 పండ్లు ఏంటో తెలుసుకుందాం.

నేరేడు పండు :

ఎన్నో అద్బుత ఔషద గుణాలు కలిగి ఉన్న ఈ పండు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్న విటమిన్లు మరియు ప్రోటీన్‌లు శరీరక దృడత్వంను పెంచుతుంది. క్రోమియం మరియు పైబర్‌లు ఎక్కువగా ఉండే నేరేడు శృంగార సామర్థ్యంను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ పండు ప్రతి రోజు సాయంత్రం సమయంలో తినడం వల్ల రాత్రి శృంగారంలో రెచ్చి పోవచ్చు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

పుచ్చకాయ :

వేసవిలో ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపించే పుచ్చకాయలో ఔషదగుణాలు ఉంటాయి. శరీరానికి చలువు చేస్తుందని ఎక్కువ శాతం దీన్ని తింటూ ఉంటారు. కాని దీనివల్ల ఇంకా పలు ఉపయోగాలున్నాయని వైధ్యులు అంటున్నారు. ముఖ్యంగా శృంగార సామర్థ్యం పెంచే గుణం ఈ పుచ్చకాయలో ఎక్కువగా ఉన్నట్లుగా పరిశోదనల ద్వారా వెళ్లడైంది.

 జామపండు :

జామ కాయను కాకుండా జామ పండును తినడం వల్ల శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. ప్రతి రోజు కనీసం 150 గ్రాములు ఉండే జామకాయను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. జామపండులో ఉండే కొన్ని ప్రోటీన్‌లు పురుషుడి శరీరంలోని శృంగార హార్మోన్‌లను ప్రేరేపితం చేస్తాయి. అందుకే జామపండు శృంగార సామర్థ్యం పెంచడానికి దివ్వ ఔషదం అని చెప్పుకోవచ్చు.

మామిడి పండు :

మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తుందంటారు. అయితే మోతాదులో తింటే ఆరోగ్యంకు చాలా మంచిది. మామిడి పండ్లతో రక్త ప్రసనణ వేగం పెరుగుతుంది. అందువల్ల ఇది శృంగార సామర్థ్యంను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆపిల్‌ :

ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు అయినా ఆపిల్‌ను తినవచ్చు. అనారోగ్య సమస్యలు లేని వారు కూడా ఆపిల్‌ను తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు అంటారు. అలాగే ఆపిల్‌ వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Comments

comments