news

ఆ డైరెక్టర్ ఒక రాత్రికి 10 లక్షలు ఇస్తా అన్నాడు.

ఫిదా సినిమాలో నటించిన గాయత్రీ గుప్తా చెప్పిన కన్నీటి నిజాలు..ఆ డైరెక్టర్ ఒక రాత్రికి 10 లక్షలు ఇస్తా అన్నాడు.గాయత్రీ గుప్తా ఈ పేరు చెప్పగానే గుర్తు పటేంత గొప్ప నాయక ఏంకాదు, ఫిదా సినిమాలలో సాయి పల్లవి పక్కన ఆమె శ్నేహితురాలి క్యారేటర్లో కనిపించిన నటి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ సైడ్ యాక్టర్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలపై మాట్లాడింది. అయితే ఇక్కడ దారుణమైన పదజాలాన్ని ఉపయోగించింది. ఫక్ అంటూ తిట్టింది. చాలా మంది నన్ను ఒకరాత్రికి రమ్మన్నారు. చాలా డబ్బు ఆఫర్ చేశారు. కానీ పడుకొని డబ్బులు సంపాదించడం నాకు ఇష్టం లేక ఆ పని చేయలేదు. సినిమా అంటే ఒక ఫ్యాషన్ దాంట్లో ఆనందాన్ని వెతుకుంటా కానీ ఒకరిదగ్గర పడుకొను అంటూ చేప్పుకొచ్చింది గాయత్రీ.

రెండేళ్ల క్రితం తను ఓ సినిమా ఒప్పుకున్నానని.. తనను వాడుకునే ఆలోచనలుంటే ముందే చెప్పేయండి.. అలాంటివి వుంటే తను చేయనని తెగేసి చెప్పినట్లు తెలిపింది. అందుకు సదరు నిర్మాతలు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు.. తాము ప్రాస్టిట్యూషన్ నడపట్లేదు.

ప్రాజెక్టు మాత్రమే చేయబోతున్నామని.. ఆరిస్టులను గౌరవిస్తామని చెప్పారు. దీంతో ఆ ప్రాజెక్టు చేసేందుకు తను ఒప్పుకున్నానని గాయత్రీ వెల్లడించింది. అయితే షూటింగ్ ప్రారంభం అయ్యాక దర్శకుడు, నిర్మాత వేధింపులు మొదలెట్టారు. ముందే చెప్పానుగా నాకు ఇలాంటివి నచ్చవని అంటే కెరీర్ గుర్తు చేశారని తెలిపింది. తనకు అహంకారం వుందని.. ఇలాగైతే కెరీర్ కష్టమేనని దర్శకులు, నిర్మాత అంటే ఇది అహం కాదని, ఆత్మగౌరవమని చెప్పానంది.

తన ఫోటో చూసి ఎందరో ఆఫర్స్ చేశారు. అంగీకరించివుంటే ఈపాటకి కోట్లు సంపాదించేదానివని అన్నారు. ఒక రాత్రికి కోట్లిస్తామన్నా తాను ఒప్పుకోలేదు. డబ్బులు సంపాదించడం తన ఉద్దేశం కాదని ఖచ్చితంగా చెప్పేశాను.

కానీ ఓ రోజు ఆ చిత్ర నిర్మాత డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. మధ్యలో కారు బ్రేక్ డౌన్ అయ్యిందని చెప్పి, కాసేపు రెస్ట్ తీసుకుందామని ఒక ప్లేస్‌కి తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక మళ్లీ లైంగికంగా వేధించారు. తన డ్రెస్‌ను లాగేస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఎలాగోలా తప్పించుకుని వచ్చేశానని గాయత్రి తెలిపింది.

అప్పటి నుంచి ఆ నిర్మాతకు తాను దూరంగా వున్నాననీ.. ఐతే అతడు తను ఒప్పుకునే ప్రాజెక్టులన్నీ తప్పిస్తున్నాడని.. టాలీవుడ్‌లో ఆయనో బడా నిర్మాతేనని గాయత్రి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. హీరోయిన్‌గా రావాలంటే “యు షుడ్ స్లీప్ విత్ మీ” అన్నారు.

ఆయన ఆ మాట అనడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని వెల్లడించింది. ఇలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఇతరులపై ఆధారపడక్కర్లేదని డిసైడ్ అయ్యానని తెలిపారు. వెంటనే తానే కొత్త ప్రాజెక్టు చేపట్టానని గాయత్రి తెలిపింది.

Comments

comments