health

జిమ్ లో చేరడం వలన కలిగే ఈ 13 నష్టాల గురించి మీకు తెలుసా?

ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ విపరీతంగా పెరిగింది. తినే ఆహారం విషయంలో కావచ్చు, ఆహారం తీసుకునే టైమింగ్స్ విషయంలో కావచ్చు లేదా రోజువారీ వ్యాయామాల విషయంలో కావచ్చు శరీరాన్ని ఫిట్ గా అలాగే హెల్తీగా దీర్ఘకాలం పాటు ఉంచుకోవడమే మనందరి లక్ష్యం. ఇక వ్యాయామం విషయానికి వస్తే చాలా మంది రన్నింగ్ మరియు యోగా గురించి గుర్తించరు. వ్యాయామం అనగానే మొదటగా వారికి జిమ్ మాత్రమే గుర్తొస్తుంది.

శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ కి వెళ్లడం వల్లనే సాధ్యమవుతుందని డైలీ రొటీన్ లో జిమ్ కి కూడా తగినంత సమయాన్ని కేటాయించాలని కొందరి భావన. అయితే, జిమ్ కి వెళ్లడం ద్వారానే ఫిట్ గా ఉంటామని అనుకుంటే మీ అభిప్రాయం తప్పే. ఎందుకంటే, శరీరాన్ని హెల్తీగా అలాగే ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ మాత్రమే మార్గం కాదు. మరెన్నో మార్గాలున్నాయి.

జిమ్ లో చేరడం వలన ఆరోగ్యానికి హానీ కలగవచ్చు. డబ్బు కూడా వృధా అవుతుంది. జిమ్ కి వెళ్లడం వలన కలిగే ఈ 13 నష్టాల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. తద్వారా, మీరు జిమ్ కి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించగలుగుతారు.

1. ఆహారంలో అసమతుల్యత

నిజం చెప్పుకోవాలంటే, జిమ్ లో హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ లకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా, దీని వలన ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలనిపిస్తుంది. ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం, ఆహారంపై ఆకర్షణ పెరగడంతో జంక్ ఫుడ్ ను తీసుకునే అవకాశాలుంటాయి. ఇది టమ్మీని నింపుతుంది కానీ ఇందులో పోషకాలు లభించవు.

దీనివలన డైట్ లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే, రోజులో సిఫార్సు చేయబడినన్ని పోషకాలు శరీరానికి అందవు. వర్కవుట్ ని ఏ లక్ష్యంతో చేస్తున్నారో అందుకు తగిన డైట్ ను తీసుకోవలసి వస్తుంది. ఈ విషయంపై అవగాహన లేకుండా కేవలం వ్యాయామానికి ప్రాధాన్యం ఇస్తే పోషకాహార లోపం తలెత్తుతుంది.

2. డబ్బు వృధా

ప్రతిరోజూ జిమ్ కి రెగ్యులర్ గా వెళ్లాలని అనుకున్నా కొన్ని సార్లు వెళ్లడం కుదరకపోవచ్చు. కొత్తలో జిమ్ కు వెళ్లి కొవ్వు కరిగించుకోవాలన్న ఆతృత అధికంగా ఉండటంతో తరచూ జిమ్ కి వెళ్లడం జరుగుతుంది. క్రమేణా, జిమ్ కు డుమ్మా కొట్టడం జరుగుతుంది.

కొన్ని వారాలు పోయాక, జిమ్ కి ఇచ్చే ప్రయారిటీ తగ్గుతుంది. మీరు పే చేసిన త్రీ మంత్ ప్యాకేజ్ చివరికి వచ్చేసరికి జిమ్ కి కేవలం కొన్ని సార్లు మాత్రమే మీరు వెళ్లి ఉండుంటారు. అందువలన, ఈ విషయంలో డబ్బు వృధా అని చెప్పుకుంటున్నాము.

3. తీవ్రమైన గాయాలు

జిమ్ లో జాయిన్ అవగానే మీ శారీరక సామర్థ్యానికి మించిన వ్యాయామాలను మీరు చేసేందుకు మొగ్గు చూపుతారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చెనందుకు ప్రయత్నిస్తారు.

ఇది ఒకరకంగా మంచిదే, ముందుకు వెళ్ళడానికి ఈ విధానమే సరైనది. బాధ లేకుండా లాభం లభించదు. అయితే, ఈ విషయంలో అతిగా ప్రవర్తిస్తే తీవ్రమైన గాయలయ్యే ప్రమాదం ఎదురవవచ్చు. హిప్ లో అలాగే మోకాళ్ళలో గాయాలు తీవ్రమయితే మెడికల్ ట్రీట్మెంట్ అవసరపడవచ్చు.

4. తమ శరీరంలో లోపం ఉందన్న ఆలోచన

బీడీడీ లేదా బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అనే ఒక రకమైన హిపోకాండ్రియాకల్ డిజార్డర్ కలిగిన వ్యక్తులలో తమ శరీరంలో లోపాలున్నాయన్న ఆలోచన ఉంటుంది. శరీరంలో లోపం లేకపోయినా వారు ఎదో ఒక లోపాన్ని ఎంచుకుంటూ ఉంటారు. పెర్ఫెక్ట్ బాడీ కోసం తపిస్తారు. ఈ విధంగా వారు తమ శరీరంలో లోపాల్ని వెతకడమే పనిగా పెట్టుకుంటారు.

అందువలన, వీరు విపరీతమైన వర్కవుట్స్ చేసి పెర్ఫెక్ట్ బాడీని సాధిద్దామని ప్రయత్నిస్తారు. దీని వలన ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం జిమ్ కి వెళ్ళాలి గాని విపరీతమైన ఆలోచనా ధోరణితో వెళితే ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా బ్యూటీ స్టాండర్స్డ్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి గైడెన్స్ లేకుండా జిమ్ లో విపరీతమైన వర్కవుట్స్ చేస్తే ఆరోగ్యానికి హానికరం.

5. జిమ్ గిల్టీ

ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ సరైన వ్యాయామం చేయటంలేదన్న గిల్టీతో జిమ్ లో జాయిన్ అవుతారు. కేలరీలను బర్న్ చేయాలన్న ఉద్దేశ్యంతో జిమ్ లో చేరతారు. అయితే, ఫీజు పే చేశాక జిమ్ కి సమయాన్ని కేటాయించలేని వ్యక్తులు కొందరుంటారు. ఎందుకంటే, వారి బిజీ షెడ్యూల్ ఆ విధంగా ఉంటుంది. అందువలన, జిమ్ కి వెళ్లలేదన్న గిల్టీతో మానసికంగా స్ట్రెస్ కి గురవుతారు.

6. జిమ్ అడిక్షన్

జిమ్ అనేది అడిక్టివ్. ముఖ్యంగా రోజూ జిమ్ కెళ్ళేవారికి ఈ సమస్య ఎదురవవచ్చు. అయితే, ఏవైనా కొన్ని కారణాల వలన జిమ్ కు కొన్ని నెలలపాటు విరామం ప్రకటిస్తే వారు తమ శరీరం గురించి అలాగే తమ చర్మం గురించి అసౌకర్య భావనలను పెంచుకుంటారు. తద్వారా, గిల్టీనెస్, ఆందోళన, లాస్ మరియు డిప్రెషన్ వంటి భావనలకు గురవుతారు. ఈ కారణాల రీత్యా వారి శరీరం కొన్ని అనుకోని మార్పులకు గురవుతుంది.

7. ఓపెన్ ఎయిర్ ఎక్సర్సైజేస్

ఓపెన్ ఎయిర్ లోని ఎక్సర్సైజ్ లోని మజా మిస్ అవుతారు. తద్వారా, అందే ప్రయోజనాలను మిస్ అవుతారు. ఓపెన్ ఎయిర్ లో ఎక్సర్సైజ్ అనేది మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. ఉల్లాసంగా ఉంచుతుంది. సంతోషంగా అలాగే అలర్ట్ గా ఉంచుతుంది. అందువలన, ఆరోగ్యంగా అలాగే సంతోషంగా ఉండగలుగుతారు.

8. షెడ్యూల్

వ్యాయామం చేసే పద్దతులలో ఎక్సర్సైజ్ రోటీన్స్ ను తరచూ మార్చాలి. ఒక షెడ్యూల్ కి శరీరం అలవాటు పడకూడదు. జిమ్మింగ్ వలన పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది మీరు గమనించాలి.

9. నియంత్రణ

జిమ్స్ అనేవి స్టఫీగా ఉంటాయి. ఓపెన్ గా అలాగే ఇంట్లో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉండదు. ఇన్ఫలోనైతే మీకు నచ్చినట్టుగా ఉండవచ్చు. ఇంట్లోనైతే సృజనాత్మక ఎక్సర్సైజ్ లను కూడా ప్రయత్నించవచ్చు. తద్వారా, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జిమ్ లో అందరూ సౌకర్యంగా ఫీల్ అవకపోవచ్చు.

10. సమయం వృధా

జిమ్ అనేది అందరికీ ఇళ్ళకి దగ్గరగా ఉండకపోవచ్చు. జిమ్ కి చేసేందుకు చేసే ప్రయాణానికి సమయం పట్టవచ్చు. అందువలన, డబ్బుని అలాగే సమయాన్ని వృధా చేయవలసి వస్తుంది. సరైన జిమ్ కు చేరేందుకు డబ్బుని అలాగే సమయాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.

11. కాస్త భయం కలుగుతుంది

జిమ్ లో ఎక్విప్మెంట్ తో పాటు మెషిన్స్ ఎక్కువగా ఉంటాయి. కొత్తగా జిమ్ లో చేరిన వ్యక్తికి ఈ ఎక్విప్మెంట్ ను చూడడం వలన కాస్త భయం కలుగుతుంది. అలాగే భారీగా దృఢంగా ఉన్న వ్యక్తులు జిమ్ లో ఎక్సర్సైజ్ లు చేయడాన్ని చూసి కూడా వీరు కొంత ఆందోళనకు గురవుతారు.

12. హోమ్ జిమ్ ను బిల్డ్ చేయడం సులభం

జిమ్ మెంబర్షిప్ కు చాలా ఖర్చవుతుంది. జిమ్ లో లభ్యమయ్యే ఎక్విప్మెంట్ ను మీరు పూర్తిగా వాడకపోవచ్చు. మరోవైపు హోమ్ జిమ్ ను ఏర్పాటు చేసుకోవడం సులభం. మీకు అవసరమైన ఎక్విప్మెంట్ తో హోమ్ జిమ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.

13. గుండె దెబ్బతింటుంది

జిమ్ లో వ్యాయామం చేయడం ఒత్తిడితో కూడినది. దీంతో గుండె ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కార్డియో లేదా ఎక్స్టెన్సీవ్ కార్డియో వంటివి గుండె సమస్యల ప్రమాదాన్ని ఏడు రెట్లు పెంచవచ్చు. అందువలన, వర్క్ అవుట్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ ను తరచూ చెక్ చేసుకోవాలి.

Comments

comments