politics

రెండు నెలల్లో రాజకీయ కార్యాచరణ..! లక్ష్మినారాయణ ప్రకటన..!!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తన రాజకీయ ఆకాంక్షలతో తొలిసారి అనంతపురం జిల్లా ధర్మవరంలో బహిరంగంగా ప్రకటించారు. అక్కడ చేనేత కార్మికులతో మాట్లాడిన తరవాత రెండు నెలల్లో తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని విస్పష్టంగా మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకూ.. తాను సమస్యలపై అధ్యయనం చేస్తున్నానని అధ్యయనం.. పూర్తయిన తర్వాతే.. రాజకీయాలా…లేక మరో రంగమా అన్నది నిర్ణయించుకుంటాని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు నేరుగా.. రెండు నెలల్లో రాజకీయ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పడంతో… ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని తేలిపోయింది.

ఈ ప్రకటనతో పాటు..రాజకీయంగా తన పంథా ఎలా ఉండబోతోందో కూడా లక్ష్మినారాయణ వెల్లడించారు. తక్షణం ధర్మవరం చేనేత కార్మికుల కోసం రూ. వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపట్లలో కానీ.. శ్రీకాకుళం పర్యటనలో కానీ…లక్ష్మినారాయణ నేరుగా… ఇలాంటి ప్రకటనలు చేయలేదు. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లుగా.. లక్ష్మినారాయణ ప్రకటలు చేస్తూండటంతో.. ఆయన పక్కా ప్లాన్‌లోనే ఉన్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటనలను పూర్తి చేయనున్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రధాన సమస్యను గుర్తించి…దానిపై ఓ నివేదిక తయారు చేసి.. తన పార్టీకి మ్యానిఫెస్టోగా ప్రకటించే అవకాశం ఉంది. సీబీఐ జేడీకి ఉన్న ఇమేజ్ ప్రకారం.. వేరే ఏ పార్టీలో చేరినా.. ఆయనపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఏపీలో సారధ్యం వహించడం లేదా సొంతంగా పార్టీ పెట్టడం అనే రెండు ఆప్షన్లపై ఆయన సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది బంధువులు, సన్నిహితులను కూడగట్టి.. రాజకీయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎస్కేయూ వీసీగా పని చేస్తూ రాజీనామా చేసిన రాజగోపాల్… లక్ష్మినారాయణ బృందంలో కీలక సభ్యుడు.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు ఈయన. అక్కడ ఈయన స్పందిస్తున్న తీరును బట్టి చూస్తే సైకిలెక్కడం ఖాయమే అని అనుకోవాలి. తన పర్యటనల్లో ఈయన ఎక్కడా ప్రభుత్వ తీరును విమర్శించడం లేదు. ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను ఎత్తి చూపడం లేదు. బాబు పాలన ఎలా ఉందంటే.. విధానాలు బాగా ఉన్నాయని కూడా అంటున్నాడు. తప్పంతా అధికారులదే అని కూడా చెబుతున్నాడు.

ఈ మాటలను బట్టి చూస్తే లక్ష్మినారాయణ చంద్రబాబుపై చాలా సానుకూలంగా ఉన్నాడనే అర్థం అవుతోంది. లక్ష్మినారాయణ తమ పార్టీలోకి వస్తే స్వాగతం అని తెలుగుదేశం పార్టీ ఇది వరకే ప్రకటించింది. అవసరార్థం తెలుగుదేశం పార్టీ ఇలాంటి వారిని డైరెక్టుగా చేర్చుకోకుండా కూడా బండి నడిపిస్తూ ఉంటుంది. తమ పార్ీ కాదు.. అన్నట్టుగానే పెట్టి తమపట్ల సానుకూలంగా స్పందించేలా ఉపయోగించుకొంటూ ఉంటుంది.

ఇది వరకూ లోక్ సత్తాను అలాగే వాడుకున్నారు. జేపీని తటస్థుడిగా పెట్టి పొగిడించుకున్నారు. ఇప్పుడు లక్ష్మినారాయణను తటస్థుడిగా పెట్టి నడిపించడమా? లేక బీజేపీలోకి చేర్చి పొడిగిండచుకోవడమా? ఈ రెండూ గాక డైరెక్టుగా సైకిల్ ఎక్కించుకుంటారా? ఎలా చూసినా ఈయన టీడీపీ ఏజెంటే అనేది మాత్రం గట్టిగా వినిపిస్తున్న అభిప్రాయం.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment