news

భూమికి డెడ్ లైన్ ఇదే… చివరి కోర్కెలు తొందరగా తీర్చుకోండి

పాశ్చాత్య దేశాల్లో డూమ్స్ డే ప్రభావం చాలా ఎక్కువ. ప్రళయం వచ్చే రోజు గురించి అతిగా ఆలోచించేవాళ్లు అమెరికా, యూరప్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇలాంటి వాళ్ల భయాన్ని ఆసరగా చేసుకుని అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే ఓసారి నిబిరు గ్రహం భూమిని తాకనుందని, ప్లానెట్ ఎక్స్ తో మానవాళికి ముప్పు తప్పదని, మనిషికి చివరి ఘడియలు సమీపించాయని ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ కాలక్రమంలో తేలిపోయాయి.

ఇప్పుడు మరోసారి భూమి సర్వనాశనం అవుతుందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ప్రఖ్యాత డూమ్స్ డే థియరిస్టు డేవిడ్ మీడే ఏప్రిల్ 23న భూమికి చివరి రోజు అని, ఎవరికైనా చివరి కోర్కెలు ఉంటే ఈ లోపే తీర్చుకోండి అంటూ హెచ్చరిస్తున్నాడు. గతంలోనూ మీడే ఇలాంటి ప్రకటనలు చాలా చేశాడు. అయితే ఈసారి నిబిరు, ప్లానెట్ ఎక్స్ కి తోడు జోంబీ గ్రంథాన్ని కూడా రంగంలోకి తెచ్చాడు. ఈ నెల 23న అర్థరాత్రి 12 గంటల ఒక్క నిమిషానికి భూమి విస్ఫోటనం చెందుతుందని తెలిపాడు. దీని గురించి బైబిల్ లో కూడా ప్రస్తావన ఉందని అంటున్నాడు మీడే.

అంతేకాదు, సూర్యుడు కన్యరాశిలోకి ఎంటరైనప్పుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకగ్రహం ఒకే వరుసలోకి వస్తారని అప్పుడు భయంకరమైన విపత్తులు సంభవించే అవకాశముందని కొందరు సైంటిస్టులు చెబుతుండగా, ఈ మూడు గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు నిబిరు గ్రహం భూకక్ష్యలోకి ప్రవేశించి మానవాళిని సర్వనాశనం చేస్తుందని మీడే హెచ్చరిస్తున్నాడు. అందువల్ల భూమ్మీద ఉన్న అనంత ప్రాణికోటికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయని, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు ఎంజాయ్ చెయ్యండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నాడు. ఆం… ఇలాంటివి ఎన్ని వినలేదు? చూడలేదు? అంటారా వదిలేసి మీ పనులు మీరు చేసేసుకోండి. ఇటువంటి ప్రచారాలు, ఊహాగానాలు, పుకార్లపై నమ్మకాలు ఉంటే కాస్త ఎంజాయ్ పాళ్లను పెంచేసుకోండి.

Comments

comments