news

“మేడం మీ బట్టల మీద మరక బయటికి కనిపిస్తోంది” అని గన్ మాన్ చెప్తే… ఆ మహిళా ఐపీఎస్ ఏమన్నారో తెలుసా?

ప్యాడ్ మాన్ సినిమా తర్వాత ఆడవారి నెలసరి సమస్య ఒక చర్చనీయాంశంగా మారింది.. ఎన్నో ఏళ్లుగా గుట్టుగా ఉన్న విషయం ఇప్పుడు బట్టబయలవుతున్నది.. దీనిపై ఆడవారితో పాటు మగవారు మాట్లాడానికి ముందుకొస్తున్నారు.. ఆ మధ్య స్కూల్లో తన బట్టలకు మరకలు అయ్యాయిని అవమానంతో ఒక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఇదే విషయం గురించి ఇబ్బంది పడిన ఒక ఐపిఎస్ ఆఫీసర్ తన జ్ణాపకాలను పంచుకున్నారు… ఇది సినిమా రాకముందు జరిగిన విషయం..అప్పటికి ఇంకా జనాల్లో ఇంత అవగాహన కూడా లేదు.

మంజిత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేరస్తులను హడలెత్తించడమే కాదు, నృత్యకారిణి కూడా.. మహిళల పీరియడ్స్ పై ప్రజల ఆలోచనా తీరు మారాల్సిన అవసరముందని మంజిత బలంగా చెబుతారు. తన అనుభవం తన మాటల్లోనే…”అప్పుడు అహ్మదాబాద్‌లో నేరాలపై సదస్సు జరుగుతోంది. అందులో మేము ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు యూనిఫాంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఆ సదస్సు జరుగుతున్న సమయంలో నాకు నెలసరి వచ్చింది. దాంతో నా యూనిఫాం మీద పెద్ద మరక ఏర్పడింది. నేను కూర్చున్న కుర్చీ కూడా తడిచిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న మహిళా పోలీసు అధికారి నేనొక్కదాన్నే.. మిగతా వారంతా మగవాళ్లే… నేను ఎవరితో మాట్లాడాలి? వారి ముందు ఎలా నిలబడాలి? ఎలా వెళ్లాలి? ఆ సదస్సు ముగిసిన తర్వాత ప్రొటోకాల్ ప్రకారం, మేమంతా నిలబడి పైఅధికారికి సెల్యూట్ చేయాలి. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది”

అప్పటి దాకా నెలసరి అంటే అందరికీ చెప్పే విషయం కాదన్న అభిప్రాయం ఉండేది. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అయినా సరే ఆ సమయంలో మాత్రం ఇబ్బందిగా అనిపించింది. ఒకవేళ నేను నిలబడితే, నా వెనక ఉన్నవాళ్లంతా ఆ మరకను చూస్తారని అర్థమైంది. అయినా సరే, నిలబడాలని నిర్ణయించుకున్నా.. నా వైపు చూసి అంతా నవ్వినా, నా డ్యూటీ నేను చేయాలని అనుకున్నా.. ఇక అంతే నిలబడ్డాను. మా బాస్‌కి సెల్యూట్ చేశాను. నేను వెళ్లేవరకూ ఎవరూ వెళ్లరని నాకు తెలుసు. దాంతో నేనే వెళ్లడం ప్రారంభించాను. అప్పుడు నా వెనుక 40 మంది మగ పోలీసు అధికారులు ఉన్నారు.

వాళ్లంతా నా యూనిఫాం మీద ఉన్న ఆ మరకను చూశారు. ఆ మరక కనిపించకుండా డైరీ లేదా ఫైల్‌ అడ్డుపెట్టుకుని బయటకు వెళ్లేదాన్ని.. కానీ, అలా చేయొద్దని నిర్ణయించుకున్నా. ‘‘మేడం మీ బట్టల మీద మరక బయటికి కనిపిస్తోంది” అని నా గన్‌మెన్ చెప్పారు. అది సహజంగా వచ్చేదే, వర్రీ అవ్వొద్దు అని అతనికి చెప్పాను.అదే విషయం నా కింది అధికారులకు కూడా చెప్పాను..

Comments

comments