news

ఒక వ్యక్తిలో వాటిని చూసి వారి వ్యక్తిత్వం, మనస్తత్వం తెలుసుకోవచ్చునట!!

ఎలాంటి వారో తెలుసుకోండి

మీరు నడిచే నడకను బట్టి, అలాగే నడిచేటపుడు మీ చేతులను ఎలా ఊపుతూ నడుస్తున్నారో దాన్ని బట్టి మీ మనస్తత్వాన్ని మీ క్యారెక్టర్ ని చెప్పవచ్చునట. నడక ఓ రకంగా మనిషికి అదనపు అందాన్ని తెచ్చి పెడుతుంది. ఒక్కొక్కరు ఒక్కోలా నడుస్తూ ఉంటారు. మోడల్స్, హీరో, హీరోయిన్లు.. రాంప్ వాక్ లని, అవనీ ఇవనీ తమ అందమైన నడకతో అదరగొడుతుంటారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన నడిచే స్టయిల్ జాతీయ స్థాయిలో పాపులర్ అని తెలిసిందే. ఆయన నడక తీరును ఇమిటేట్ చేయని స్టేజ్ ఆర్టిస్ట్ ఉండడు. నడకకు అంత శక్తి ఉంది మరి. ఎన్నో అంశాల ఆధారంగా వ్యక్తిత్వం, మనస్తత్వం చెప్పినట్టుగానే నడకనుబట్టి కూడా జ్యోతిష్యులు జ్యోస్యం చెబుతున్నారు. అంగసాముద్రికం అనేది కూడా జోతిష్యం లో ఒక ప్రధాన భాగం. మనిషి చేతులను ఊపుతూ ఏవిధంగా నడుస్తాడో దాన్ని బట్టి వారి వ్యక్తిత్వాన్ని చెబుతారు.. మరి ఏ విధంగా నడిస్తే ఎలాంటి మనస్థత్వాలు కలిగి ఉంటారో కింద చూద్దాం..

 

పులి, సింహం, ఏనుగు, ఎద్దు, హంస, నెమలి లాగా ఠీవీగా ఎక్కువగా చప్పుడు కాకుండా చక్కగా రెండుపక్కలా గమనిస్తూ నడవటం చాలా శ్రేయస్కరం. అలాగే తాబేలు, కప్పతీరుగా నడవటం, చాలా వేగంగా, వంకరటింకరగా తూలుతూ, దుంకుతూ, పెద్ద పెద్ద అడుగులు వేస్తూ.. పక్కకి కనపడిన ప్రతిదానిని తాకుతూ కాళ్ళతో తంతూ, ఆగుతూ మళ్లీ మళ్లీ నడుస్తూ ఉండే నడక అశుభ ప్రదమైనదట. ఇక నడిచేటపుడు చేతి వేళ్ళు పూర్తిగా ఒదులుగా తెరిచి నడిస్తే.. ఇటువంటి వారు ఉదారులు, నిష్కపటులు, ఏ విషయాన్ని దాచలేరట. మనసిచ్చి మాట్లాడుతారట. కక్ష సాధింపు వీరిలో అసలుండదట. చేతి వేళ్ళు సగం తెరిచి సగం మూసి నడిస్తే, వీరు చాలా జాగ్రత్త పరులట. కఠోర దీక్షా పరులు కూడానట. చాలా తక్కువగా మాట్లాడతారట వీరు. అంతేకాదు రహస్యాలను దాస్తారట కూడా. మితంగా ఖర్చులు చేస్తారట. వీరిలో కొద్ది పాటి కాటిన్యం కూడా ఉంటుందట. చేతి వేళ్ళు పూర్తిగా మూసి.. అంటే పిడికిలి లా బిగించి నడిస్తే వీరు తామస గుణం కలిగిఉంటారట. కోపం కుటిలత్వం ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఏదైనా రహస్యాన్ని అసలే బయట పెట్టరట. ఇతరులను ఏమాత్రం లక్ష్య పెట్టరట. తన పంతం నెగ్గించుకోవడానికి ఏదైనా చేస్తారని జ్యోతిష్యం చెబుతోంది. ఇక..

చేతివేళ్లను, తనకాళ్ళ వైపు కాక ముందు లేదా వెనుకకు చూసేట్టు సగం వంచి నడిస్తే అటువంటి వారు.. తాము తలచిన పనులను సాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారట. పరిశ్రమ, పట్టుదల, ఓర్పు, ఉదారత్వం, పరోపకారం, జ్ఞానం, శక్తి సామర్ధ్యాలు, వీరికి ఎక్కువేనట.. అలాగే చేతులను వెనకకు పెట్టుకోని, అరచేయిని మరో అరచేతిలో పట్టుకొని, లేదా వేళ్ళను వేళ్ళతో పట్టుకొని కొంత తలవంచి నడిచే వారి విషయానికి వస్తే.. వీరు చెప్పేదొకటి, చేసేది ఒకటట. తమ ఆలోచనలను, చర్యలను, రహస్యాలను ఏమాత్రం బయటపెట్టరట. దీర్ఘాలోచన, దూరాలోచన వీరి సొంతమట. జంకుబొంకు, కపటం, భయం, దాపరికం వంటివి వీరికి మెండుగానే ఉంటాయి.

చేతులను జేబులో లేదా కోట్ లో పెట్టుకొని నడిచేవారి విషయానికి వస్తే.. వీరికి ప్రాపంచిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో బాగా తెలుసుకుంటూ ఉంటారట. రహస్యాలను బాగా దాచగలుగుతారట. కార్య సాధకులు కూడానట. దీక్షాదక్షత పట్టుదల వీరి సొంతమట. అలాగే చేతులను ముందు పెట్టుకొని, వేళ్ళను నలుపుతూ మాట్లాడేవారు లేదా మాట్లాడుతూ నడిచేవారి విషయానికి వస్తే.. ఇలాంటివారు పచ్చి అవకాశావాదులుగా ఉంటారని జ్యోతిష్యుల మాట. అయితే కార్య సమర్ధులట. అలాగే మాయజీవులు కూడానట. ఎంతటి అన్యాయాన్నైనా యిట్టె చేయగలరట. మాటల్లో చతురత, చేతల్లో చురుకుదనం వీరి విశిష్ఠ లక్షణమట. కోపం, తాపం, సంతోషం నవ్వు, తృప్తి అన్ని డ్రామా లాగా, నాటకంగా ప్రదర్శించే సమర్ధులు, ఆ అంశాల్లోదిట్టలట.

ఇక చివరిగా ఒక చేతిని వెనకకు పెట్టుకుని మరొక చేతిని ముందుకు సగం ఎత్తి ఒదులుగా ఉంచి,తిప్పుతూ వేళ్ళను నలుపుతూ మాట్లాడటం లేక అలా నడిచే వాళ్ళు…వీరు తమకు తామే గొప్ప వారుగా అనుకుంటారు. గర్వం,కోపం,పంతం,పట్టుదల, డైరెక్ట్ డెసిషన్ తీసుకునే వారుగా ఉంటారు..ఆత్మస్తుతి పాలేక్కువ అంటే తనని గురించి తను పోగుడుకుంటూ ఇతరులు చెబుతూ ఉండడం…అదండీ విషయం బాగున్నాయి కదూ అయితే ఇంకెందుకు ఆలస్యం…మీరు మీ నడక స్టైల్ ని మార్చుకోండి…ఎదుటి వారు ఎలా నడుస్తున్నారో వారి గురించి వారి మనస్తత్వం గురించి ఇంకా వారి వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకోండి…

Comments

comments