news

లైంగిక వేధింపుల కేసులో గ‌జ‌ల్ శ్రీనివాస్ అరెస్ట్… అమ్మాయి తో అసలు సంబంధం ఏంటి?!!

ప్రముఖ గజల్‌ కళాకారుడు కేసిరాజు శ్రీనివాస్‌ అలియాస్‌ గజల్‌ శ్రీనివాస్‌ను యువతిపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్‌ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు చర్యలకు ఉపక్రమించినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు.. ఆలయవాణి అనే వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తున్నారు. ఈ వెబ్‌ రేడియో గజల్‌ శ్రీనివాస్‌దే కావడం గమనార్హం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక దర్యాప్తు జరిపిన వెంటనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

 

ఆధ్యాత్మికత, దేశభక్తి, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నో కళారూపాలు చేసిన గజల్‌ శ్రీనివాస్‌ లైంగికవేధింపుల కేసులో అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేసుకు సంబంధించి వీడియోలు, ఆడియోలు వంటి పూర్తి ఆధారాలతోనే బాధితురాలు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.

మహిళా రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన గజల్‌ శ్రీనివాస్‌ అలియాస్‌ కేసిరాజు శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. యాక్సిడెంట్‌ గాయాలతో బాధపడుతున్న తనకు ఆ అమ్మాయే ఇష్టపూర్తిగా మసాజ్‌ చేసిందని, అయితే ఆమె పట్ల తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్‌కే చెందిన ఆలయవాణి వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తున్న యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు బుధవారం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

 ఆత్మసాక్షిగా చెబుతున్నాను : ఆత్మసాక్షిగా చెబుతున్నాను. నేను మహిళల్ని గౌరవిస్తాను. ఆ అమ్మాయి మా సంస్థలోనే పనిచేస్తుంది. నామీద ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడంలేదు. కొద్ది రోజుల కిందట నాకు యాక్సిడెంట్‌ అయింది. అందువల్ల బాడీలో కొన్నిచోట్ల కాల్షియమ్‌ పేరుకుపోయింది. దాన్ని నియంత్రించడానికి రెగ్యులర్‌గా మసాజ్‌ చేయించుకుంటాను. ఒకరోజు ఫిజిషియన్‌ రాకపోయేసరికి ఆ అమ్మాయే ముందుకొచ్చి.. మసాజ్‌ చేస్తానంది. నేను వద్దన్నా వినకుండా మసాజ్‌ చేసింది. నాకు ఆమెపట్ల ఎలాంటి బ్యాడ్‌ ఇంటెన్ష్‌ లేదు.. అని గజల్‌ శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.
సాధారణ ఫిర్యాదులకు భిన్నంగా నేరానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభించడంతోనే గజల్‌ శ్రీనివాస్‌కు నోటీసులు లాంటివి ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేశామని పంజాగుట్ట ఏసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. బాధితురాలు బయటి ఊరి నుంచి వచ్చి ఇక్కడ(హైదరాబాద్‌లో) ఓ హాస్టల్‌లో ఉంటూ గజల్‌ శ్రీనివాస్‌కు చెందిన రేడియోలో పనిచేస్తోంది. తాను లైంగిక, మానసిక వేధింపులకు గురయ్యానంటూ ఫిర్యాదుఇవ్వడమేకాక.. సంబంధిత వీడియో, ఆడియో రికార్డులను కూడా బాధితురాలు అందించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 509ను అనుసరించి కేసులు నమోదుచేశామని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం గజల్‌ శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. 12 వరకు ఆయనకు రిమాండ్ విధించారు.

Comments

comments

Recent Posts