Business

గుడ్ న్యూస్: ‘బంగారం’లా దాచుకోవడానికి ప్రభుత్వం కొత్త స్కీం!!

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్వారా ప్రభుత్వం మరోసారి సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జిబి) జారీ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలిసారిగా ఈ బాండ్లు (2018-19 సీరిస్‌ 1) జారీ అవుతున్నాయి. పెట్టుబడి లాభాల కోసం ఫిజికల్‌ గోల్డ్‌ కొనడం ఇష్టం లేని వ్యక్తులు ఈ బాండ్స్‌లో ‘బంగారం’లా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ బాండ్స్‌ గురించి మరిన్ని వివరాలు..


సబ్‌ స్క్రిప్షన్:
ప్రారంభం : ఏప్రిల్‌ 16, 2018
చివరి తేదీ : ఏప్రిల్‌ 20, 2018
జారీ ధర:
ఒక గ్రాముకు సమానమైన బాండ్‌ నామినల్‌ విలువ రూ.3,114. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తే గ్రాముపై రూ.50 డిస్కౌంట్‌.

వడ్డీ రేటు:
వార్షిక వడ్డీ రేటు 2.5 శాతం. దీన్ని గ్రాము నామినల్‌ ధర రూ.3,114 ఆధారంగా లెక్కిస్తారు. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరంలో రెండు సార్లు చెల్లిస్తారు.
పెట్టుబడి పరిమితి:
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక గ్రాము. గరిష్ఠంగా నాలుగు కిలోలకు మించకూడదు.
కాల పరిమితి:
ఎనిమిది సంవత్సరాలు. మరీ డబ్బులు అవసరం అనుకుంటే ఐదో ఏట వడ్డీ అదుకున్న రోజు బాండ్స్‌ అమ్ముకుని బయటపడొచ్చు.
ట్రేడింగ్‌:
ఆర్‌బిఐ నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నుంచి బిఎ్‌సఇ, ఎన్‌ఎ్‌సఇల్లో ఈ గోల్డ్‌ బాండ్స్‌ ట్రేడవుతాయి.

ఇతర లాభాలు:
* ఈ బాండ్స్‌ను హమీగా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చు.
* డీమ్యాట్‌ ఫార్మాట్‌లో ఉంటాయి కాబట్టి భద్రతకు ఢోకా ఉండదు.
* రిడంప్షన్‌ వరకు ఉంచుకుంటే వచ్చే లాభాలకు దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టిసిజి) పన్ను వర్తించదు.
* ఐదో యేట బాండ్స్‌ ఇంకొకరికి బదిలీ (అమ్ముకున్నా) చేస్తే వచ్చే లాభాలపై మాత్రం ఎల్‌టిసిజి విధిస్తారు. అయితే దీనికి ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ వర్తిస్తుంది.
* ఎస్‌జిటిల కొనుగోలు, అమ్మకాలకు జిఎస్‎టీ వర్తించదు.
* ఫిజికల్‌ బంగారంలా మేకింగ్‌ చార్జీలు ఉండవు. తర్వాత అమ్ముకోవాలంటే తరుగు, ఇతరత్రా గోల్డ్ లాస్ లు ఉండవు.
* గోల్డ్‌ ఇటిఎఫ్ లు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల గోల్డ్‌ పథకాలపై చెల్లించినట్టు ఎస్‌జిబిలపై ఎలాంటి వార్షిక ఖర్చులు ఉండవు.

ఇన్వెస్ట్‌ చేయొచ్చా?!

గత వారం మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం రూ.31,850 నుంచి రూ.32,100 మధ్య కదలాడింది. స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికే ఆటుపోట్లలో ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. చమురు పోటుతో దేశీయంగా ద్రవ్యోల్బణం కోరలు చాచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ రేటు కంటే కొద్దిగా తక్కువ ధరకే ప్రభుత్వం ఈ ఎస్‌జిబిలు జారీ చేస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రేటు ఏటికేటికి బక్క చిక్కుతోంది. దాంతో పసిడి ధర పైపైకి చూస్తోంది. ఏటా 2.5 శాతం చొప్పున ఏడాదికి రెండు సార్లు వడ్డీ అందుకునే అవకాశం, దీర్ఘ కాలిక మూలధన లాభాలకూ అవకాశం ఉంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈక్విటీ మార్కెట్లో పెద్దగా రిస్కు తీసుకోలేని ఇన్వెస్టర్లు కూడా ఈ ఎస్‌జిబిలపై ఒక లుక్కేయవచ్చు.

Comments

comments