health

గ్రీన్ టీ మీ బరువును తగ్గించడానికి ఏ విధంగా సహకరిస్తుందో మీకు తెలుసా!

బరువు తగ్గించదంలో గ్రీన్ టీ పాత్రను గురించి తెలిపే అనేక వ్యాసాలను మీరు ఇప్పటికే చాలా చదివి ఉంటారు . కానీ ఏ గ్రీన్ టీ బరువును తగ్గించడంలో ఉత్తమమైనదో మీకు తెలుసా? ఈ వ్యాసం రాయడానికి ముఖ్య కారణం అదే క్యాన్సర్ నివారణ మరియు చికిత్స, హృద్రోగ సమస్యలు, రుమటాయిడ్ ఆర్ధ్రైటిస్, ఇన్ఫెక్షన్లు, దంత సమస్యలు మరియు అధిక కొలెస్ట్రాల్ వంటి రోగాల పరిష్కారానికి, గ్రీన్ టీని మీ దైనందిన ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీలో ఎన్నో వ్యాధులతో పోరాడే ఎపిగాల్లోకెటచిన్-3 గల్లేట్ (EGCG), అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీ రుచికి చేదుగా, మనను ఉత్తేజపరిచే గుణాలతో ఉంటుంది.

గ్రీన్ టీలో కేటచిన్, ఎపికేటచిన్, ఎపికేటచిన్ గాలెట్ (ECG), ఎపిగాల్లోకెటచిన్-3 గల్లేట్ (EGCG) అనే కేటచిన్ పోలిఫెనోల్స్ యొక్క రసాయన సమూహం మరియు అనేక ఇతర ప్రోఏంథోసయినడిన్స్ ఉంటాయి.

బరువు తగ్గించడానికి ఏ గ్రీన్ టీ అత్యుత్తమమైనదో చదివి తెలుసుకోండి.

1. గ్యోకురోచ

2. సెంచా

3. బంచా

4. మచ్చా

5. హోజిచ

6. గెన్మైచ

గ్యోకురోచ:

ఈ రకమైన తేయాకులను కాచినపుడు, ఆకుపచ్చ రంగులోకి మారతాయి. లేత చిగుర్ల నుండి ఈ ఆకులను సేకరించడం మూలాన, ఆరోగ్యానికి మేలు చేసే ఈ రకం టీకి అత్యుత్తమ రుచి మరియు సువాసన ఉంటాయి. ఇంతేకాక, లేత ఆకులలో టానిన్లు మరియు కెఫిన్లు తక్కువగా ఉండటం మూలాన, ఈ టీ లో చేదుతనం తక్కువగా ఉంటుంది.

బరువును తగ్గిస్తుంది:

జీవక్రియను వేగవంతం చేసి, గ్రీన్ టీ బరువు కోల్పోయేందుకు దోహదపడుతుంది. రోజు ఉదయాన్నే ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీని సేవిస్తే, అధిక బరువు సమస్య ఒకటి రెండు వారాల్లో పరిష్కారమవుతుంది.

మధుమేహాన్ని తగ్గిస్తుంది:

గ్రీన్ టీ పంచదార కలపకుండా తీసుకుంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. దీనిలోని యాస్ట్రిజెంట్ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలు మంచి ఆరోగ్యాన్ని కలిగించి, క్లోమం మెరుగ్గా పనిచేసేటట్లు ప్రోత్సహిస్తుంది. దీనివలన మధుమేహం మీ దరి చేరదు.

Comments

comments