news

మీరు చేస్తే ఈ చిన్న తప్పులే మీ జుట్టు రాలటానికి కారణాలు.. అవేంటో తెలుసుకోండి..!!

మనమంతా మన జుత్తు అందంగా మృదువుగా,మెరిసేలా ఉండడమే కాకుండా జుత్తు రాలకుండా ఉండాలని కోరుకుంటాం. వాస్తవంగా మన జుత్తు అందం మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి ఉంటుంది. మనలో చాలామంది తమకు తెలియకుండానే జుత్తు విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు.

1. దువ్వెనలు శుభ్రపరచకపోవడం:

డస్ట్ తో ఉన్న బ్రష్ వలన దుమ్ము కణాలు,నూనెలు నెత్తిమీద పేరుకుపోయి జుట్టును నాశనం చేస్తాయి. అందుకే మీ జుట్టుకు వాడే బ్రష్ ను వారానికి ఒక రోజైనా సబ్బు మరియు, వేడి నేటితో శుభ్రపరచండి.

2. చాలా తరచుగా షాంపూ వాడడం:

పొడవాటి జుత్తు ఉన్నవారు రోజూ షాంపూ పెట్టడానికి ఇష్టపడుతుంటారు. అయితే దీనివలన కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. చాలా షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉండి, జుట్టులో ఉండే సహజసిద్దమైన నూనెలను పీల్చుకొని జుట్టును బాగా పొడిబారేలా చేస్తాయి. అందుకే మీ జుట్టుకు వారాని రెండు నుంచి మూడుసార్లు షాంపూ పెట్టుకుంటే మంచిది. అంతే కాకుండా జుత్తు మూలాలకు మాత్రమే షాంపూ వాడితే జుట్టుకు మంచిది.

౩. షాంపూ మొత్తాన్ని తొలగించకపోవడం:

షాంపూతో తలస్నానం చేశాక పూర్తిస్థాయిలో షాంపూను కడిగేయాలి. లేక పోతే జుట్టుపై మిగిలిపోయిన షాంపూ తిరిగి త్వరగా జుట్టపై దుమ్ము, దూళి పట్టుకొనేలా చేస్తుంది.

4. హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించేముందు మీ జుట్టును పొడిగా ఉంచకపోవడం:

హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించేముందు జుట్టును పొడిగా ఉంచకపోవడమనే తప్పును చాలామంది చేస్తుంటారు. పొడిగా చేయకుండా ఆ ఉత్పత్తులను జుట్టుపై అప్లై చేస్తే అప్పటికే జుట్టులో ఉన్న నీరు ఆ ఉత్పత్తులను పలుచగా చేస్తుంది. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు.

5. టవల్ తో మీ జుట్టును ఆరబెట్టడం:

టవల్ తో మీ జుట్టును ఆరబెడితే బాగున్నట్టు అనిపిస్తుంది కాని అది కరక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. టవల్ తో జుత్తు ఆరబెట్టడం వలన మీ జుత్తు మొదళ్ళు పాదవడమే కాకుండా పైపొర విడిపోతుంది. టవల్ ను బిగుతుగా కట్టడంతో వెంట్రుకలు రాలిపోయే ఆస్కారం అధికంగా ఉంటుంది. టవల్ కాకుండా కాటన్ వస్త్రాలతో జుట్టను ఆరపెట్టేట్టు చేయటం మంచిది.

6. తల స్నానం చేసేముందు మీ జుట్టును దువ్వుకోకపోవడం:

మీరు తల స్నానం చేసేముందు దువ్వుకొని స్నానం చేస్తే మంచిది. తడి జుట్టు చిక్కు తీసేప్పుడు జుట్టు బాగా రాలిపోవటేమే కాకుండా త్వరగా బలహీన పడుతుంది. ముందే కాస్త దువ్వుకొని తలస్నానం చేస్తే చిక్కు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో జుట్టు పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

7. తడి జుట్టుతో నిద్రకు ఉపక్రమించడం:

సాదారణంగా తడి జుత్తు బలహీనంగా ఉంటుంది. తడి జుట్టుతో పడుకోవడం వలన మీ జుత్తు తొందరగా పాడవుతుంది. మీ జుట్టును పగిలేట్టు కూడా చేస్తుంది.

8. వేడి నీటితో తలస్నానం చేయడం:

చాలా మంది తలస్నానం చేసేప్పుడు ఎక్కువ వేడి నీటిని ఉపయోగిస్తుంటారు. వేడి నీరు మీజుట్టులో రంగును తొలగించి నూనె ఉత్పత్తి చేసే గ్రంధులను యాక్టివేట్ చేస్తుంది. గోరువెచ్చని నీరు ఉపయోగిస్తే జుట్టులో ఉన్న మురికిని తొలగించి,రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

Comments

comments

Recent Posts