health

వీర్యకణాల ఉత్పత్తిని పెంచే పుచ్చకాయ

పుచ్చకాయను ఇంగ్లీషులో వాటర్‌మిలన్‌ (Watermelon)గా పేరు. రుచికి చాలా తీయగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. తక్కువ కేలరీలతో ఎక్కువ పీచుతో, మంచి పోషక విలువలు కలిగి అందర్నీ ఆకర్షిస్తుంది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. పుచ్చకాయలంటే కేవలం వేసవిలో దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడతాయని మాత్రమే మనకు తెలుసు. కానీ అనేక ఆరోగ్య సమస్యలకు పుచ్చకాయలు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి.

పుచ్చకాయలో ఉండే లైకోపీన్ అనే పదార్థం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేగాకుండా ఈ లైకోపీన్ వీర్యకణాలు ఎక్కువసేపు సజీవంగా ఉండేలా కూడా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉంటాయి. అందులోని 8 శాతం లైకోపీన్ మాత్రం వీర్యవృద్ధిని పెంచటమేగాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సులక్షణాలను కలిగి ఉంది.

లైకోపీన్ అనబడే ఈ ఫైటో కెమికల్ గుండె, ప్రొస్టేట్, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే ఓవరియన్, సర్వికల్, నోటి సంబంధిత క్యాన్సర్లనుంచి కూడా రక్షణనిస్తుంది. ఇంకా పుచ్చకాయ వేసవినుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాలిన గాయాలమీద చల్లని పుచ్చకాయ ముక్కల్ని ఉంచితే ఉపశమనం కలుగుతుంది.

అధిక రక్తపోటుతో బాధపడే వారికి పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. ఇందులోని అమినో ఆమ్లాలు గుండెకు సంబంధించిన కండరాలని సడలించి రక్త సరఫరా సక్రమంగా అయ్యేట్లు చేస్తాయి.

Comments

comments