health

ఎండకాలంలో ఈ కాయలు తింటే మీకు ఏ ఖాయాలా రాదు… అన్నీ చల్లబడతాయి

వేసవిలో కొన్ని రకాల కూరగాయాలు తీసుకోవడం చాలా అవసరం. అవి బాడీలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చాలా రకాల ప్రయోజనాలు వాటి వల్ల లభిస్తాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే సొరకాయ శరీర ఉష్ణోగ్రతనీ కడుపులో మంటని తగ్గిస్తుంది. చెమట ద్వారా సోడియం పోకుండా చేస్తుంది. మధుమేహాన్ని, బీపీనీ అదుపులో ఉంచుతుంది. శరీరంలోని నీటిశాతాన్ని పెంచుతుంది.

శరీరానికి చల్లదనం

సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. శరీరం విపరీతమైన వేడితో బాధపడేవారు దీని రసం తాగడం వల్ల శరీరాన్ని కూల్ చేస్తుంది. సొరకాయలో నీటి శాతం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

పొట్లకాయ

పొట్లకాయ శరీరం పొడిబారకుండానూ, చల్లగానూ ఉండేలా చేస్తుంది.ఒకప్పుడు వారంలో రెండు సార్లైనా పొట్లకాయతో కూర చేసేవారు మన పెద్దవాళ్ళు. ఇప్పటిలా ఇంటర్నెట్లు, హెల్త్ వెబ్ సైట్స్ లేకపోయినా వాళ్ళకి అది తినటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో బాగా తెలుసు. రోజులు మారేసరికి కూరగాయల వాడకంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఈ రోజుల్లో పిల్లలు పొట్లకాయ తినటానికి అంతగా ఆశక్తి చూపించటం లేదు. దానికి కారణం అందులో ఎన్ని పోషకవిలువలు దాగి ఉన్నాయో తెలియకపోవటమే అయ్యుంటుంది.

బూడిదగుమ్మడి

బూడిదగుమ్మడి వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. బీపీతో పాటు ఆస్తమా, రక్త సంబందిత వ్యాధులు, మూత్ర సమస్యలూ ఇలా ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుంది. తెలుగువారి ఇంటి ముంగిట గుమ్మడిపండును వేలాడదీయడం మనం నిత్యం చూస్తాము. బూడిదగుమ్మడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడి కూరగాను వడియాలు గాను వాడతాము. కడుపులో మంటగాని, ఉబ్బరంగాని, అతిదాహం ఉన్నప్పుడు బూడిదగుమ్మడిని తినడం వలన గ్యాస్ ట్రబుల్ నివారించవచ్చు.

బీరకాయ

బీరకాయ రక్తశుద్ధికి, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌… వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

కాకరకాయ

కాకరకాయ చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వేడి పొక్కులూ, చెమటకాయలూ, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. కాకరకాయలో హైపోగ్లైసెమిక్‌ పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్‌ లెవల్స్‌ ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్‌ దరిచేరకుండా ఉంటుంది. లివర్‌ శుభ్రపడుతుంది. అంతే కాకుండా రక్తంను శుభ్రపరచడంలో కాకరకాయ చాలా తోడ్పడుతుంది. రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నివారిస్తుంది.

పైల్స్‌ ఉన్న చోట రాస్తే

కాకరకాయ చెట్టు వేళ్లను పేస్టులా చేసి పైల్స్‌ ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకరకాయ జ్యూస్‌ బాగా ఉపకరిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలోనూ తోడ్పడుతుంది. ఎండకాలంలో ఈ కాయలు తింటే మీకు ఏ ఖాయాలా అంటే ఏ రోగం రాదు.

Comments

comments