health

అవయవాల కోసం ప్రత్యేక ఆహారాలు తీసుకోవాలి … అంగం ఆరోగ్యం కోసం ఆ ఆహారం తీసుకోవాలి !!

ఆకలేస్తోందని.. ఏదిపడితే అది లాగించేస్తున్నారా..? అయితే బీ కేర్‌ ఫుల్‌. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో అలా తింటున్న ఆహారం మంచిది కాదని తేలింది. 90 శాతం కంటే ఎక్కువ మంది.. సరైన ఆహారం తీసుకోవడం లేదని ఆ పరిశోధన నిర్ధారించింది. తింటున్న ఆహారం శరీరంపై దుష్ప్రభావం చూపుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తీసుకునే ఆహారం ఏదైనా.. శరీరానికి హాని చేయనిదైతే మంచిది.

ఆహారం బాగుంటే..

మనం తీసుకునే ఆహారం బాగుంటే.. మన శరీరంలోని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎరుపురంగు ఉన్న ఆహార పదార్థాలు తింటే.. గుండె, రక్తానికి మంచిది. అలాగే ఆకుకూరలైతే కంటికి మంచిది. ఇలా రోజూ తీసుకునే ఆహారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు ఉపయోగపడేలా చూసుకుంటే మీజీవితం పదికాలాలపాటు చల్లగా ఉంటుంది. శరీరంలోని ఏ భాగానికి ఎలాంటి ఆహారం మంచిదో చూద్దాం..

అండాశయం కోసం ఆలీవ్‌

ఇటాలియన్‌ అధ్యయనం ప్రకారం నిత్యం ఆలివ్‌ ఆయిల్‌ వాడే మహిళల్లో మిగితా సాధారణ స్త్రీలతో పోలిస్తే క్యాన్సర్‌ వచ్చే అవకాశం 30 శాతం వరకు తగ్గుతుందని తేలింది. దీనికి గల కారణాలు ఇంకా నిర్ధిష్టంగా తెలియనప్పటికినీ ఈ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల వల్లనే ఇది సాధ్యం అవు తుందని శాస్త్రవేతలు అంచనా వేస్తున్నారు. ఈ అలివ్‌ నూనె వాడే వారిలో అది క్యాన్సర్‌ జన్యువులను అణగదొక్కుతుందని కొంతమంది పరిశోధనలో వెల్లడించారు.

గుండె కోసం.. ద్రాక్ష

మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె. ఇది నిరంతరం పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ద్రాక్షగుత్తుని దూరం నుండి గమనిస్తే అచ్చం గుండె అక్కతెలు కనిపిస్తుంది. కొంతమేరకు ద్రాక్షకు ఉండే పర్పుల్‌ రంగుతో గుండెకాయ రంగుకు దగ్గర దగ్గరగా ఉంటుంది. ఈ ద్రాక్షలోని ప్లేవరాయిడ్స్‌ అనే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ ప్లేవరాయిడ్స్‌ గుండె జబ్బులను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ గుండెకు చేదు, ఘాటుగా ఉండే ఆహారాలు కావాలి. ఘాటైన దినుసులు, రాజ్గీరా, బక్‌వీట్‌, ముల్లంగా, ఉల్లిపాయలు, ఆవాలు, వెల్లుల్లి, నెయ్యి, మెగ్నీషియం అధికంగా వుండే ఆహారాలు అవసరం.

మెదడు కోసం.. వాల్‌నట్‌.. బాదాం

వాల్‌నట్‌ చూడటానికి అచ్చం మెదడులాగానే ఉంటుంది. మెదడులోని ముడతలను పోలి దీని నిర్మాణం ఉంటుంది.ఇందులో ఒమెగా-3 ఫ్యాట్‌ యాసిడ్స్‌ మోతాదులో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడులోని కణాలను పనిచేసేలా చేస్తాయి. అంతేకాదు న్యూరాన్ల మధ్య సమాచారం జరిగేలా చూస్తాయి. అందుకే మన జ్ఞాపకశక్తి బాగా ఉండి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం, నరాల మెరు గైన ఆరోగ్యంకోసం వాల్‌నట్‌ తీసుకోవడం చాలా మంచిది. ఈ అవయవం ఇష్టపడే ఆహారాలు కర కర లాడేవిగా ఉండాలి. చిప్స్‌ అది ఎపుడు యాక్టివ్‌గా ఉన్నా కరకరలాడే ధ్వని వచ్చే ఆహారాలు కావా లంటుంది. వేయించిన పప్పులు, క్యారెట్‌ ముక్కలు, బాదం, అప్రికాట్‌, వాల్‌నట్‌ వంటి ఎండు ఫలాలు కోరుతుంది.

ఎముకల కోసం పాలకూర

పాలకూరలను నిత్యం మన ఆహారంలో తీసుకోవడం వలన శరీరంలో ఎముకల నిర్మాణానికి క్యాల్షియం దోహదపడుతుంది. ఆ క్యాల్షియం మునగలో ఎక్కువ. మునగాకులో మరీ ఎక్కువ. ఈ మునగాకులతోపాటు పాలకూర కట్టలో క్యాల్షియం ఆకులను నిత్యం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

జీర్ణ వ్యవస్థ కోసం బొప్పాయి

మనం తీనే ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలి. ఈ జీర్ణ వ్యవస్థకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. ఈ బొప్పాయి నెలవుకోత అచ్చం కడుపు కుహరం పోలి ఉంటుంది. అందుకే ఈ పండును తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుం దని నిపుణుల మాట. మన జీర్ణ ప్రక్రియ జరిగే మార్గమంత ఒక మెత్తటి కుంచెతో శుభ్రం చేసినట్టుగా ఉండాలంటే రోజు ఉదయం భోజనానికి ముందుగా ఒక బొప్పాయి తీసుకోవాలి. భోజనం చేసిన తర్వాత ఒక బొప్పాయి పండు తీసుకోవడం అలవర్చుకోవాలి.

అంగం బాగా గట్టిపడడానికి ఇవి తినాలి

పాలకూరలు, బ్రాకోలి, మెంతికూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పచ్చిగా కానీ, ఉడక బెట్టిగాని తినాలని అంటున్నారు. పిస్తా నట్స్‌లో ఆరోగ్యవంతమైన కొవ్వు పదార్థాలతో ఎల్ అర్జినిన్ ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు.

రక్తప్రసరణ పెరిగి..

ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కణజాలంలోని రక్తనాళాల్లో మెత్తటి కణజాలాన్ని వ్యాకోచింపజేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి అంగం గట్టిపడుతుందని అభిప్రాయపడుతున్నారు. పైపెచ్చు.. ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని, గుండెజబ్బుల వల్ల వచ్చే అంగస్తంభన లోపాన్ని రాకుండా చేస్తుందంటున్నారు. పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పదార్థం రక్తనాళాల్ని వ్యాకోచింపజేసే గుణాన్ని కలిగి రక్త ప్రసరణను ఎక్కువ చేస్తుందంటున్నారు.

Comments

comments