news

షాకింగ్: ప్రభాస్ హీరోయిన్ పై క్రిమినల్ కేసు!!

సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ వారసురాలిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రద్దా కపూర్. మొదటి చిత్రం ఆషికీ 2 చిత్రంతో అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేక పోయాయి. ఓ వైపు మోడలింగ్ మరో వైపు సినిమాల్లో నటిస్తున్న శ్రద్దాకపూర్ పై తాజాగా చీటింగ్, క్రిమినల్ కేసు నమోదైంది.

ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రదారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి హ‌సీనా జీవిత నేప‌థ్యంలో హ‌సీనా పార్క‌ర్ అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 22న విడుదలైంది. ఆశించినంత స్థాయిలో ఈ సినిమా ఆడకపోయినా శ్రద్ధ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.. అంతేకాదు నిర్మాత చేసిన పనికి ఇప్పుడు ఆమెకు అరదండాలు కూడా పడ్డాయి.

ఒప్పందంలో భాగంగా ప్రమోషన్లలో తమ బ్రాండ్ దుస్తులే ధరించాలని హీరోయిన్ శ్రద్ధా, ప్రొడ్యూసర్లతో ఆ సంస్థ డీల్ కుదుర్చుకుంది. కానీ, ఒప్పందంలో రాసుకున్న‌ట్లుగా శ్ర‌ద్ధా క‌పూర్ గానీ, సినిమా బృందం గానీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో త‌మ బ్రాండ్ `ఏజేటీఎమ్ (ఏజే మిస్త్రీ అండ్ థియా మిన్హాస్‌)`కు ప్ర‌చారం క‌ల్పించ‌డం లేదంటూ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు.. సినిమా మొత్తంలో ఎక్కడా కంపెనీ పేరు వేయకపోవడంతో యాజమాన్యం నిర్మాత నహిద్‌ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌పై ముంబయిలోని అంధేరీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది.. దీంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు పూర్తి విచారణ జరిపి తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు..

 

బాహుబలి హిట్ తో మాంచి దూకుడుమీదున్న ప్రభాస్ పబ్లిక్ లో ఆ క్రేజ్ చల్లారిపోకముందే‘సాహో’ను రిలీజ్ చేయాలని సీరియస్ కాన్సన్ ట్రేషన్ తో ఉన్నాడు. ఆ చిత్ర యూనిట్ మొత్తం అందుకోసం చాలా స్పీడ్ గా షూటింగ్ నడిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ చేస్తోంది. ఈ కేసులు పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోయినా మానసికంగా ఈ డిస్టర్బెన్స్ లో ఉన్న శ్రద్ధ కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా వేసుకోవచ్చు. అదే జరిగితే సినిమా అనుకున్నంత వేగంగా పూర్తికాదని యూనిట్ ఆందోళనలో ఉంది. మరోవైపు ఇటీవల ముంబాయిలో ఓ టాప్ లొకేషన్ లో షూటింగ్ కు పెట్టుకున్న పర్మిషన్ క్యాన్సిల్ కావడంతో చిత్ర బృందం అంతా ఆ ఏరియా నుంచి పెట్టే బేడా సర్దుకుని రావాల్సి వచ్చింది. ఇలా ‘సాహో’ సినిమాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment