news

మెరుపులా నుంచి విద్యుత్‌ను తాయారు చేసుకోవచ్చ??

మెరుపుల్లోని కరెంటును వాడుకోవచ్చా

వేరు వేరు విద్యుదావేశాలు గల మేఘాలు ఒక దానితో మరొకటి ఒరుసుకు పోవడం వల్ల ఉత్పన్నమయ్యే విద్యుత్‌ ఉత్సర్గవమే(ఎలక్ట్రిక్‌ డిస్చార్జ్‌) మెరుపులు. ఆ మెరుపులు వాతావరణంలోని గాలిలో ఉత్సర్గమైతే వచ్చే శబ్దమే ఉరుము. ఆ విధంగా మెరుపులు, ఉరుములు విద్యుత్‌ శక్తికి సంబంధించినవే.

మెరుపుల నుంచి విద్యుత్తును ఉత్పన్నం చేయవచ్చని, తద్వారా ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్లాంటును నిర్మించవచ్చని శాస్త్రజ్ఞుల ఆలోచన. ఈ విద్యుత్‌ శక్తిని నీటిని వేడి చేయడానికి ఉపయోగించవచ్చు. ఆ నీటిని వేడిచేయడం వల్ల వచ్చే నీటి ఆవిరిని ఒక ఎలక్ట్రిక్‌ జనరేటర్‌ను నడపడానికి వాడుకోవచ్చు. మెరుపుల్లోని విద్యుదావేశాన్ని ఎలక్ట్రికల్‌ కెపాసిటర్లలో నిల్వ చేయవచ్చు. కానీ ఇంత వరకూ ఇవి అమల్లోకి రాలేదు.

 

పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే విద్యుత్తు కొన్ని వందల కిలోవాట్లు ఉంటుంది. ఆ సామర్థ్యంతో వంద వాట్ల బల్బుల్ని కొన్ని నెలలపాటు వెలిగించవచ్చు. అయితే మెరుపులు, ఉరుములు వచ్చేది అతి స్వల్ప సమయం. ఆ కాలంలో మనం వాడుకునేంత పరిమాణంలో విద్యుత్‌ శక్తి ఉత్పన్నం కాదు. కానీ మెరుపుల్లో ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత గల విద్యుదావేశాల వల్ల ఉత్పన్నమయ్యే ప్లాస్మాను లోహాల ఉపరితలాలపై పూసే పూతగానూ ఎక్కువ ప్లాస్మాను సేకరిస్తే దాన్ని భవిష్యత్తులో రూపొందించే ఫ్యూజన్‌ రియాక్టర్లకు ఆధారంగానూ ఉపయోగించవచ్చు. మెరుపుల్లో ఉత్పన్నమయ్యే విద్యుత్‌ శక్తిని మనం వాడుకోకపోతే అది కాంతి, ఉష్ణ శక్తుల్లాగ రూపాంతరం చెందుతుంది. దీంతో ఆ శక్తి మనకు ఉపయోగపడనట్లే.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment